ETV Bharat / bharat

వాటర్ బాటిల్ క్యాప్స్ డిఫరెంట్ కలర్స్​లో - దీని అర్థం ఏంటో తెలుసా? - డిఫరెంట్ కలర్స్​లో వాటర్ బాటిల్ క్యాప్స్

Water Bottle Caps Facts : అందరూ కనీసం ఒక్కసారైనా.. వాటర్ బాటిల్ కొని నీళ్లు తాగి ఉంటారు. మీరు నోటీస్ చేస్తే.. ఆ బాటిల్ క్యాప్​ బ్లూ కలర్​లో మాత్రమే ఉంటుంది. అలా ఎందుకో మీకు తెలుసా? మరికొన్ని రకాల బాటిల్ మూతలు వేర్వేరు రంగుల్లో ఫిక్స్​ చేసి ఉంటాయి. దానికి కారణం ఏంటో మీకు తెలుసా..??

Water Bottle Caps
Water Bottle Caps
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2023, 2:50 PM IST

Everyone to Know Facts About Water Bottle Caps : ప్రయాణాల సమయంలో ఎక్కువ మంది తమ వెంట వాటర్ బాటిల్ తీసుకెళ్తారు. మరికొందరు దాహం వేసినప్పుడు బస్టాండ్స్​లో లేదా దారి మధ్యలో ఎక్కడైనా వాటర్ బాటిల్స్ కొనుగోలు చేస్తుంటారు. అయితే.. మార్కెట్లో కొనుగోలు చేసే వాటర్ బాటిల్స్(Water Bottles) మూతలు కేవలం నీలి రంగులో మాత్రమే ఉంటాయి. ఎప్పుడైనా గమనించారా? మరికొన్ని వాటర్ బాటిల్స్ మూతలు, కూల్ డ్రింక్స్ బాటిల్స్​ మూతలు పలు రంగుల్లో ఉంటాయి.

అయితే.. చాలా మంది ఆ కలర్స్ అనేవి.. ఆ బాటిల్ బ్రాండ్​ను సూచిస్తాయని అనుకుంటారు. మీరు కూడా అలా అనుకుంటే.. పొరబడినట్టే. పలానా రంగులో ఒక బాటిల్ మూత ఉందంటే.. దానికో ప్రత్యేకమైన మీనింగ్ ఉందని అర్థం. అలా.. ఒక్కో రంగు మూత బిగించడం వెనక ఒక్కోరకమైన ఉద్దేశం ఉంది. మరి, అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Different Colour Bottle Caps Meaning : ఈ రంగుల వెనకున్న అర్థం ఏమంటే.. ఒక్కో రంగు ఒక్కో విధమైన పోషకాలను సూచిస్తుందట! సాధారణంగా వాటర్ బాటిల్స్​.. బ్లూ కలర్ క్యాప్​తో ఉంటాయి. దీని అర్థం.. ఇందులో మినరల్స్ ఉన్నాయని. అందుకే.. బ్లూ కలర్​ క్యాప్ బాటిల్స్‌లో ఉండే నీటిని మినరల్ వాటర్‌గా చెబుతుంటారు. అలాగే మార్కెట్​లో రకరకాల కూల్ డ్రింక్ బాటిల్స్‌ ఉంటాయి. ఉందులో గ్రీన్‌ కలర్ క్యాప్​తో కొన్ని కనిపిస్తాయి. ఆకుపచ్చ రంగు క్యాప్​ను బాటిల్​కు బిగించారంటే.. అందులో అదనపు ఫ్లేవర్స్‌ యాడ్ చేశామని చెబుతున్నాయి సదరు కంపెనీలు!

ఈ సెలబ్రిటీలు తాగే 'నల్ల' నీళ్ల ధరెంతో తెలుసా?

ఎరుపు రంగు క్యాప్‌తో ఉండే బాటిల్స్‌లో.. కార్బొనేటెడ్‌ వాటర్ ఉందని అర్థం. అదేవిధంగా ఎల్లో కలర్‌ క్యాప్‌తో ఉన్న వాటర్‌ బాటిల్‌లో విటమిన్లు, ఎలక్ట్రోలైట్స్‌ ఉన్నాయని సదరు కంపెనీలు చెబుతున్నాయన్నమాట. ఇక నలుపు రంగు క్యాప్(Black Cap Water Bottle) కలిగి ఉన్న వాటర్ బాటిల్ విషయానికొస్తే.. ఈ బాటిల్​లో ఆల్కలీన్‌తో కూడిన వాటర్ ఉందని అర్థం చేసుకోవాలి. ఈ బ్లాక్‌ కలర్‌ క్యాప్‌ ఉండే వాటర్‌ బాటిల్స్‌ చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ కలర్ క్యాప్స్​ని కేవలం ప్రీమియం వాటర్ ఉత్పత్తులకు మాత్రమే ఉపయోగిస్తారు. ఇలాంటి నీటిని ఎక్కువగా సెలబ్రిటీలు తాగుతుంటారు.

పింక్ కలర్‌ క్యాప్‌తో ఉండే వాటర్‌ బాటిల్స్‌ విషయానికొస్తే.. ఇది వాటర్ గురించి చెప్పేది కాదు. పలు స్వచ్ఛంద సంస్థలు బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఇలాంటి క్యాప్స్‌ను ఉపయోగిస్తాయి. ఇలా.. ప్రతీ బాటిల్ మూత రంగు వెనక ప్రత్యేకమైన అర్థం ఉంటుందన్నమాట. మరి.. తెలియని వారు ఈ రంగుల గురించి ఎలా తెలుసుకోవాలంటే.. వాటర్ బాటిల్ మీద రాసి ఉంచే.. స్పెసిఫికేషన్స్​లో ఈ వివరం కూడా రాసి ఉంచుతారు. ఆ విధంగా.. ఆ బాటిల్​లో ఎలాంటి ఫ్లేవర్స్ ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవచ్చు. సో.. ఎప్పుడైనా వాటర్ బాటిల్ కొనుగోలు చేయాలనుకుంటే.. ఈ విషయాలను ఓసారి గుర్తు తెచ్చుకోండి.

లీటర్ వాటర్ బాటిల్ రూ.3వేలు.. ప్లేటు భోజనం రూ.7500!

మంచినీటి వ్యాపారంలోకి టీఎస్​ఆర్టీసీ.. బ్రాండ్​ ఏంటో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.