ETV Bharat / bharat

రోజుకు 4 'పోక్సో' కేసులు మూసివేత.. కారణమిదే! - పోక్సో కేసులపై అధ్యయనం

దేశంలో చిన్నారులపై నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పోక్సో చట్టం కింద నమోదవుతున్న కేసులూ అంతంత మాత్రమే. అందులోనూ.. సరైన ఆధారాలు లేక కేసులు మూసివేయటం వల్ల రోజుకు నలుగురు చిన్నారులు న్యాయానికి దూరమవుతున్నట్లు ఓ అధ్యయనం తేల్చింది. ఏటా 3వేలకుపైగా కేసులు నమోదవుతున్నా.. దర్యాప్తు విఫలమైన చాలా కేసులు కోర్టు వరకు చేరటం లేదని పేర్కొంది.

Pocso cases
రోజుకు నాలుగు పోక్సో కేసులు మూసివేత
author img

By

Published : Mar 8, 2021, 5:34 PM IST

దేశంలో రోజుకు నలుగురు లైంగిక వేధింపుల బాధిత చిన్నారులు న్యాయానికి దూరమవుతున్నారని ఓ నివేదిక వెల్లడించింది. సరైన ఆధారాలు లేక పోలీసులు కేసులు మూసివేయటమే అందుకు కారణమని తేల్చింది.

కైలాశ్​ సత్యర్థి చిన్నారుల ఫౌండేషన్​ (కేఎస్​సీఎఫ్​).. 'పోలీసు కేసుల మూసివేత విధానం: పోక్సో చట్టం, 2012 కింద దాఖలైన కేసులపై విచారణ' పేరిట అధ్యయనం చేపట్టింది. 2017-2019 మధ్య పోక్సో చట్టం కింద నమోదైన కేసులు, జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్​సీఆర్​బీ) సమాచారాన్ని విశ్లేషించింది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నివేదికను విడుదల చేసింది కేఎస్​సీఎఫ్​.

" పోలీసులు ఎలాంటి అభియోగ పత్రం​ దాఖలు చేయకుండా దర్యాప్తు చేపట్టి మూసివేసిన కేసులు 2017 నుంచి 2019 వరకు గణనీయంగా పెరిగినట్లు తెలిసింది. చిన్నారులపై నేరాలను రూపుమాపేందుకు ప్రత్యేకంగా పోక్సో చట్టం-2012ను ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ, క్షేత్రస్థాయిలో ఈ చట్టం అమలు అంతంత మాత్రమే ఉండటం నిరాశకు గురిచేసింది. ఏటా 3వేల పోక్సో కేసులు నమోదైనా దర్యాప్తు విఫలమై చాలా కేసులు కోర్టు వరకు వెళ్లలేక పోతున్నాయి. సరైన ఆధారాలు లేవని పోలీసులు కేసులు మూసివేయటం వల్ల ప్రతి రోజు నలుగురు లైంగిక వేధింపుల బాధిత చిన్నారులు న్యాయానికి దూరమవుతున్నారు. ఎన్​సీఆర్​బీ సమాచారం ప్రకారం.. మూసివేస్తున్న పోక్సో కేసుల్లో రెండింట మూడొంతుల కేసులు.. వేధింపులు నిజమైనప్పటికీ సరైన ఆధారాలు లేవు అని పోలీసులు కారణం చూపారు. "

- అధ్యయనం

అధ్యయనంలోని కీలక అంశాలు..

  • సరైన ఆధారాలు లేక కేసులు మూసివేయటం వల్ల ప్రతి రోజు నలుగురు లైంగిక వేధింపుల బాధిత చిన్నారులు న్యాయానికి దూరమవుతున్నారు.
  • ఏటా 3వేలకుపైగా కేసులు నమోదైనప్పటికీ చాలా కేసులు కోర్టు వరకు చేరటం లేదు.
  • 2019లో 43 శాతం కేసులు మూసివేశారు పోలీసులు. 2017, 2018తో పోలిస్తే ఇదే అత్యధికం.
  • తప్పుడు ఫిర్యాదుల కారణంతో మూసివేస్తున్న కేసులు రెండో స్థానంలో ఉన్నాయి. అయితే.. ఇవి క్రమంగా తగ్గుతున్నాయి. అవి 2017లో 40 శాతం ఉండగా 2019లో 33 శాతానికి పడిపోయాయి.
  • 2017-2019 కాలంలో నమోదైన కేసులను పరిశీలిస్తే.. 89 శాతం కేసుల్లో బాధితులు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. సత్వర న్యాయం అందించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని చూపుతోంది.
  • ఏటా దర్యాప్తు పెండింగ్​లో పడుతున్న కేసులు పెరిగిపోతున్నాయి. ఛార్జిషీట్​ దాఖలైన కేసులతో పోలిస్తే.. ఏడాదిలోపు దర్యాప్తు పూర్తయిన కేసులు తక్కువగా ఉంటున్నాయి. ఈ అంతరానికి ముఖ్య కారణం పోలీసులకు సరైన సదుపాయాలు లేకపోవటమేనని తెలుస్తోంది.
  • 2017-19 వరకు నమోదైన పోక్సో కేసుల్లో 51 శాతం.. మధ్యప్రదేశ్​, మహారాష్ట్ర, ఉత్తర్​ప్రదేశ్​, హరియాణా, దిల్లీలోనే ఉన్నాయి.
  • ఆయా రాష్ట్రాల్లో దోషులుగా తేలుతున్న రేటు కేవలం 30-60 శాతం మాత్రమే. సరైన ఆధారాలతో కోర్టుల ముందు కేసులను ఉంచాల్సిన ఆవశ్యకతను ఇది సూచిస్తోంది.
  • బాధితులు పేద, మధ్యతరగతికి చెందిన కేసుల్లో దర్యాప్తు సమయంలో ఆధారాలను తారుమారు చేయటం, నిజాలు చెప్పకుండా బెదిరించటం వంటి పరిణామాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటివి ప్రధానంగా నిందితుడు కుటుంబ సభ్యుడు, ధనిక వర్గానికి చెందిన వాడు ఉన్న సమయంలో జరుగుతోంది.

పోక్సో కేసుల్లో ఉన్న అంతరాలను తగ్గించి, ఎదురవుతున్న సవాళ్లు అధిగమించేందుకు ఇలాంటి కేసులను జిల్లా ఎస్పీ లేదా డిప్యూటీ కమిషనర్​ ఆఫ్ పోలీసు నేతృత్వంలో పర్యవేక్షించాలని సూచించింది అధ్యయనం. చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల దర్యాప్తునకు ప్రతి జిల్లాలో అంకిత భావం కలిగిన ప్రత్యేక బృందం ఉండాలని పేర్కొంది. ఆయా బృందాల అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, మానసికంగా సిద్ధంగా ఉండేలా చూడాలని కోరింది. పెండింగ్​ కేసులు పెరిగిపోతున్న క్రమంలో మరిన్ని ఫాస్ట్​ ట్రాక్​ ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది.

ఇదీ చూడండి: ఐదేళ్ల బాలిక అత్యాచారం కేసులో ఆరేళ్ల తర్వాత తీర్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.