ETV Bharat / bharat

ఆ ఇద్దరికీ తెలియకుండా ఆమెకు మూడో పెళ్లి.. న్యాయం కోసం భర్తల పోరాటం! - మహారాష్ట్ర న్యూస్​

మధ్యప్రదేశ్​కు చెందిన ఓ యువతి ఇద్దరు భర్తలను మోసం చేసి మూడో భర్తతో వెళ్లిపోయింది. ప్రేమిస్తున్నానని చెప్పిన యువతి ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని మోసం చేసిన ఈ ఘటన మహారాష్ట్ర నాగ్​పుర్​లో జరిగింది.

wife cheating husband news
wife cheating husband news
author img

By

Published : Jun 6, 2022, 4:21 PM IST

'లవ్​ ఎట్​ ఫస్ట్​ సైట్'​ అని చూడగానే నచ్చేశావ్ అంటూ ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది యువతి. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అంతలోనే ఓ మిస్​డ్ ​కాల్​లో మరొకరు కలిశారు. అతడిని ప్రేమించింది. భర్త, కుమారుడిని వదిలేసి అతడితో వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇన్​స్టాగ్రామ్​లో మరొకరిని కలిసింది. రెండో భర్తనూ వదిలేసి మూడో భర్త చెంతకు చేరింది. ఆ యువతి కథ తెలుసుకోవాలంటే ఈ ట్రయాంగిల్​ లవ్​స్టోరీ చూడండి!

మధ్యప్రదేశ్​ గ్వాలియర్​కు చెందిన 18 ఏళ్ల యువతి మహారాష్ట్ర నాగ్​పుర్​లోని వతోడా ప్రాంతంలో తన బంధువులతో కలిసి నివసిస్తోంది. అదే ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తిని తొలి చూపులోనే ఇష్టపడి సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఓ రోజు యువతికి మిస్​డ్​ కాల్​ వచ్చింది. ఆ కాల్​తో మహారాష్ట్రలోని ఔరంగాబాద్​కు చెందిన పవన్​ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తర్వాత వీరిద్దరి మధ్య స్నేహం మొదలై ప్రేమగా మారింది. ఆ యువతి కోసం ఔరంగాబాద్​ వదిలి నాగ్​పుర్​ చేరుకున్నాడు ఆ యువకుడు. తనకు పెళ్లి జరిగిన విషయం యువతి చెప్పకపోవడం వల్ల.. పవన్​ తనను పెళ్లి చేసుకోమని ప్రతిపాదించాడు. దీనికి ఒప్పకున్న యువతి గుడిలో పవన్​ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత మొదటి భర్తను వదిలిపెట్టి సోనేగావ్​ ప్రాంతానికి మకాం మార్చింది. దీంతో మొదటి భర్త మద్యానికి బానిసైపోయాడు.

అక్కడితో ఆగిపోని యువతి.. రెండో భర్త పనికి వెళ్లగానే సోషల్​ మీడియాలో విపరీతంగా సమయం గడిపేది. ఈ క్రమంలోనే ఇన్​స్టాగ్రామ్​లో మరో యువకుడిని కలుసుకుని.. అతడితోనూ ప్రేమలో పడింది. పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని.. మూడో భర్తతో తన కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టింది. యువతి కోసం గాలిస్తున్న రెండో భర్త పవన్​ను మొదటి భర్త కలిశాడు. ఆమెకు అంతకుముందే కుమారుడు ఉన్నాడని జరిగిన విషయాన్నంతా చెప్పాడు. యువతి వద్దకు వెళ్లి ఇద్దరు భర్తలు ప్రశ్నించగా.. మూడో భర్త వద్దే ఉంటానని తెగేసి చెప్పింది. సమాధానం విన్న ఇద్దరు భరోసా కేంద్రాన్ని ఆశ్రయించారు. అక్కడ కేసు తీసుకోపోవడం వల్ల సోనేగావ్​ పోలీస్​ స్టేషన్​ను సంప్రదించారు. కానీ ఇప్పటి వరకు యువతిపై కేసు నమోదు కాలేదు. మోసపోయిన ఇద్దరు భర్తలు ఏం చేస్తారో అనే ఈ వ్యవహారం గురించి తెలిసిన వారు ఆసక్తిగా చూస్తున్నారు.

ఇదీ చదవండి: కరోనాతో అనాథైన బాలికకు బ్యాంక్ నోటీసులు.. లోన్​ కట్టాలని ఒత్తిడి.. చివరకు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.