ETV Bharat / bharat

'యావత్ ప్రపంచం చూపు భారత్ బడ్జెట్​ వైపు.. అంతా సానుకూలమే!' - పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు 2023

Budget Session 2023 : ప్రపంచం మొత్తం భారత్​ ప్రవేశపెట్టబోయే బడ్డెట్​ వైపు చూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బడ్జెట్ సెషన్ ప్రారంభమయ్యే ముందు పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు.

budget session 2023  pm modi
budget session 2023 pm modi
author img

By

Published : Jan 31, 2023, 11:36 AM IST

Updated : Jan 31, 2023, 12:23 PM IST

Budget Session 2023 : ప్రపంచ దేశాల్లో ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో భారత బడ్జెట్​ సామాన్య పౌరుల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తుందని, ప్రపంచానికి ఆశాకిరణంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడిన మోదీ.. సమావేశాల ప్రారంభంలోనే ఆర్థిక నిపుణుల నుంచి సానుకూల సందేశాలు వస్తున్నాయన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం సమర్పించనున్న బడ్జెట్.. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేలా.. ప్రపంచం భారతదేశంపై పెట్టుకున్న నమ్మకాన్ని కూడా పెంపొందిచేలా కృషి చేస్తుందని ప్రధాని అన్నారు.

"ఈ రోజు చాలా ముఖ్యమైనది. రాష్ట్రపతి మొదటిసారిగా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగం భారత రాజ్యాంగానికి, భారత పార్లమెంటరీ వ్యవస్థకు, మహిళలకు గర్వకారణం. దేశంలోని గొప్ప గిరిజన సంప్రదాయాలను గౌరవించేందుకు ఇది ఒక అవకాశం " అని మోదీ అన్నారు.

-- భారత ప్రధాని నరేంద్ర మోదీ

'ఇండియా ఫస్ట్​, సిటిజెన్ ఫస్ట్​' అనే నినాదంతో ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాన్ని ముందుకు తీసుకెళ్తాం అని మోదీ చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల మధ్య ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్​ సాధారణ పౌరుల ఆశలు, ఆకాంక్షలను తీర్చడానికి ప్రయత్నిస్తుందన్నారు. ప్రపంచం మొత్తం చూస్తున్న ఆశాకిరణం ప్రకాశిస్తుందని.. దాన్ని నెరవేర్చడానికి నిర్మలా సీతారామన్​ అన్ని ప్రయత్నాలు చేస్తారని బలంగా విశ్వసిస్తున్నానని ప్రధాని మోదీ వెల్లడించారు.

Last Updated : Jan 31, 2023, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.