Engineering Jobs 2023 : వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ 1191 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్ చేసిన అభ్యర్థులు ఇందుకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ (Western Coalfields Ltd Recruitment 2023) ఉద్యోగాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
Apprentice Jobs 2023 :
- ట్రేడ్ అప్రెంటీస్ - 875 పోస్టులు
- టెక్నీషియన్ అప్రెంటీస్ - 101 పోస్టులు
- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ - 215 పోస్టులు
విద్యార్హతలు
Trade Apprentice Jobs Qualification :
- ట్రేడ్ అప్రెంటీస్ : ఐటీఐ (సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటీఐ చేసి ఉండాలి)
- టెక్నీషియన్ అప్రెంటీస్ : ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థలో (సంబంధిత విభాగాన్ని అనుసరించి) డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ : ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థలో (సంబంధిత విభాగాన్ని అనుసరించి) బీటెక్ లేదా బీఈ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి
Apprentice Jobs Age Limit : 2023 సెప్టెంబర్ 16 నాటికి అభ్యర్థుల వయస్సు 18 - 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం
Western Coalfields Ltd Apprentice Selection Process : సెలక్షన్ ప్రాసెస్ మొత్తం మూడు దశల్లో ఉంటుంది. మొదటిగా అభ్యర్థుల మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్‌ను తయారు చేస్తారు. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తరువాత అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అందులో క్వాలిఫై అయిన అభ్యర్థులను అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
అప్రెంటీస్ స్టైపెండ్
Western Coalfields Ltd Apprentice Stipend :
పోస్టు | స్టైపెండ్ (నెలవారీగా) |
ట్రేడ్ అప్రెంటీస్ (ఫ్రెషర్) | రూ.6,000 |
ట్రేడ్ అప్రెంటీస్ (ITI మొదటి సంవత్సరం) | రూ.7,700 |
ట్రేడ్ అప్రెంటీస్ (ITI రెండో సంవత్సరం) | రూ.8,050 |
టెక్నీషియన్ అప్రెంటీస్ | రూ.8,000 |
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ | రూ.9,000 |
దరఖాస్తు విధానం
Western Coalfields Ltd Apprentice Jobs Online Apply :
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ www.westerncoal.in ను ఓపెన్ చేయాలి.
- తరువాత దరఖాస్తు చేయడం కోసం మీ ఈ-మెయిల్ ఐటీ, మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
- మీ ఫొటో, సంతకాలను స్కాన్ చేసి, Jpeg ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి.
- దరఖాస్తును మరోసారి పూర్తిగా సరిచూసుకొని, సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
Western Coalfields Apprentice Important Dates :
- ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 సెప్టెంబర్ 1
- ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 సెప్టెంబర్ 16