Engineering Jobs 2023 : ఇంజినీరింగ్, ఐటీఐ, డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి.. ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ 351 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో (MDL Recruitment 2023) దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాలు-వివరాలు
MDL Non Executive Jobs :
- Skilled-I (ID-V) : ఏసీ రిఫ్రిజిరేటర్ మెకానిక్, కార్పెంటర్, చిప్పర్ గ్రైండర్, కాంపోజిట్ వెల్డర్, కంప్రెసెర్ అటెండెంట్, డీజిల్ కమ్ మోటార్ మెకానిక్, డ్రైవర్, ఎలక్ట్రిక్ క్రేన్ అపరేటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, గ్యాస్ కట్టర్, హిందీ ట్రాన్స్ లేటర్, జూనియర్ డ్రాట్స్‌మెన్ (ఎలక్ట్రికల్/ సివిల్/ మెకానికల్), జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ (మెకానికల్/ఎన్డీటీ), మిల్రైట్ మెకానిక్, పెయింటర్, పారామెడిక్, పైప్ ఫిట్టర్, ప్లానర్ ఎస్టిమేటర్ (మెకానిక్/సివిల్), రిగ్గర్, స్టోర్ కీపర్, స్ట్రక్చురల్ ఫాబ్రికేటర్, యుటిలిటీ హ్యాండ్ (స్కిల్డ్)
- Semi-Skilled-I (ID-II) : ఫైర్ ఫైటర్స్, సెయిల్ మేకర్, సెక్యూరిటీ సిపాయి, యుటిలిటీ హ్యాండ్ (సెమీ-స్కిల్డ్)
- Special Grade (ID-VIII) : లాంఛ్ ఇంజిన్ క్రూ/ మాస్టర్ 2ed క్లాస్
- Special Grade (ID-IX) : మాస్టర్ 1st క్లాస్
విద్యార్హతలు
MDL Non Executive Jobs Eligibility : అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థ నుంచి (సంబంధిత విభాగాలను అనుసరించి) 10వ తరగతి/ ఐటీఐ/ డిప్లొమా/ పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. (MDL Non Executive Recruitment 2023)
వయోపరిమితి
MDL Non Executive Age Limit : 2023 ఆగస్టు 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18-38 ఏళ్లు మధ్యలో ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం
MDL Non Executive Selection Process : అభ్యర్థులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. తరువాత ట్రేడ్ టెస్ట్/ స్కిల్ టెస్ట్ చేస్తారు. తరువాత మెడికల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. వీటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. అయితే ఆయా రంగాల్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
జీతభత్యాలు
MDL Non Executive Salary :
గ్రేడ్ | పే స్కేల్ |
స్పెషల్ గ్రేడ్ (IDA-IX) | రూ.22,000 - రూ.83,180 |
స్పెషల్ గ్రేడ్ (IDA-VIII) | రూ.21,000 - రూ.79,380 |
స్కిల్డ్ గ్రేడ్ (IDA-V) | రూ.17,000 - రూ.64,360 |
సెమీ స్కిల్డ్ గ్రేడ్ (IDA-II) | రూ.13,200 - రూ.49,910 |
దరఖాస్తు విధానం
MDL Non Executive Online Apply :
- అభ్యర్థులు www.mazagaondock.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- MDL అప్లై ఆన్లైన్ లింక్‌ను క్లిక్ చేసి, ఓపెన్ చేయాలి.
- ముందుగా మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి.
- దరఖాస్తులో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
- ముఖ్యమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి.
- వివరాలు అన్నీ మరోసారి చెక్ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
MDL Non Executive Notification Important Dates :
- దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 ఆగస్టు 12
- దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 ఆగస్టు 21
నోట్ : పరీక్ష తేదీ, అడ్మిట్‌కార్డ్ అందించే తేదీలను తరువాత తెలియజేస్తారు.