జమ్ముకశ్మీర్‌లోని బందిపొర జిల్లాలో భద్రతా దళాలు ఎన్కౌంటర్ జరిపాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.
ఉగ్రవాదులున్నారన్న సమాచారం మేరకు ఉత్తర కశ్మీర్ బందిపొరలోని ఛందాజీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి భద్రతా దళాలు. అనంతరం వారిపై ఎదురుకాల్పులు జరిపినట్లు ఓ అధికారి తెలిపారు.
ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగిస్తున్నట్లు అధికారి స్పష్టం చేశారు.