ETV Bharat / bharat

'మృతుల గౌరవం కాపాడేందుకు కొత్త చట్టం!' - NHRC on covid deaths

మరణించిన వారి గౌరవ ప్రతిష్ఠలు కాపాడేలా కొత్త చట్టం తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర సర్కార్లకు జాతీయ మానవ హక్కుల సంఘం సూచించింది. సామూహిక అంత్యక్రియలు జరగకుండా నివారించాలని పేర్కొంది.

nhrc
ఎన్​హెచ్​ఆర్​సీ
author img

By

Published : May 15, 2021, 6:24 AM IST

కరోనా మృతులకు అంతిమ సంస్కారాల నిర్వహణ విషయంలో అవమానకరమైన ఘటనలు వెలుగుచూస్తున్న వేళ.. కేంద్రానికి కీలక సూచనలు చేసింది జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్​హెచ్​ఆర్​సీ). మరణించిన వారి గౌరవ ప్రతిష్ఠలు కాపాడేలా కొత్త చట్టం తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర సర్కార్లకు సూచించింది.

ఈ మేరకు అనేక ప్రతిపాదనలు చేసిన ఎన్​హెచ్​ఆర్​సీ.. సామూహిక అంత్యక్రియలు జరగకుండా నివారించాలని పేర్కొంది. సామూహిక ఖననాలు.. మరణించిన వారి గౌరవాన్ని దిగజార్చుతాయని అభిప్రాయపడింది.

బిల్లులు చెల్లించలేదని మృతదేహాలను ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలు అట్టిపెట్టుకోకుండా చూడాలని, గుర్తు తెలియని మృతదేహాలను జాగ్రత్తగా భద్రపరచాలని ఎన్​హెచ్​ఆర్​సీ స్పష్టం చేసింది. బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్​లోని గంగా నదిలో మృతదేహాలు తేలడంపై ఆ రాష్ట్రాలతో పాటు కేంద్రానికి కూడా నోటీసులు జారీ చేసింది. ఎవరైనా మరణించినట్లు గుర్తిస్తే ప్రభుత్వ సంస్థలకు విధిగా సమాచారం ఇవ్వాలని పౌరులకు సూచించింది.

ఇదీ చూడండి: మంకీ మాస్క్​తో కరోనాపై అవగాహన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.