Employment News December 2023 : ఈ డిసెంబర్ నెలలో పలు ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ విడుదల చేశాయి. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఆయా నోటిఫికేషన్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Bank Of Baroda Senior Manager Recruitment 2023 : బ్యాంక్ ఆఫ్ బరోడా 250 సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
- విద్యార్హతలు : డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు అర్హులు. ఎంబీఏ (మార్కెటింగ్ & ఫైనాన్స్) చేసిన వారు కూడా ఈ పోస్టులకు అర్హులే.
- వయోపరిమతి : అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లు నుంచి 37 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- ఎంపిక విధానం : అభ్యర్థులకు ముందుగా ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. తరువాత సైకోమెట్రీ టెస్ట్ కూడా చేస్తారు. వీటిలో ఉత్తీర్ణులైన వారికి గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహించి.. అందులో క్వాలిఫై అయిన వారిని సీనియర్ మేనేజర్ పోస్టులకు ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను వీక్షించండి.
- దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 డిసెంబర్ 26
IB ACIO Recruitment 2023 : మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో పనిచేసే ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) 995 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- ఉద్యోగాల వివరాలు : అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ - గ్రేడ్ II ఎగ్జిక్యూటివ్ పోస్టులు - 995
- విద్యార్హతలు : అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
- వయోపరిమితి : అభ్యర్థుల వయస్సు 2023 డిసెంబర్ 15 నాటికి 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- అప్లికేషన్ ఫీజు : అభ్యర్థులు అందరూ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.450 చెల్లించాలి. దీనికి తోడు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ (పురుషులు) అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు మాత్రం అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
- ఎంపిక ప్రక్రియ : అభ్యర్థులకు ముందుగా టైర్-1, టైర్-2 పరీక్షలను నిర్వహిస్తారు. వీటిలో మెరిట్ సాధించిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి, వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి.. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
- జీతభత్యాలు : అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు జీతం అందిస్తారు.
- దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 డిసెంబర్ 15
NIOS Recruitment 2023 : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్లోని.. పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగంలో గ్రూప్ A,B,C పోస్టుల భర్తీ కోసం విద్యా మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
- ఉద్యోగాల వివరాలు : ఈ రిక్రూట్మెంట్ ద్వారా మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, ఎడ్యుకేషనల్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 62.
- దరఖాస్తుకు ఆఖరు తేదీ : ఆసక్తిగల అభ్యర్థులు డిసెంబర్ 21లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Hindustan Shipyard Limited Recruitment 2023 : హిందూస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్.. మేనేజర్స్, కన్సల్టెంట్స్, ప్రోజెక్ట్ ఆఫీసర్స్, మెడికల్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య 99. ఆసక్తిగల అభ్యర్థులు డిసెంబర్ 24లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని ఉద్యోగాల వివరాల కోసం ఈ లింక్‌లను క్లిక్ చేయండి.
- నిరుద్యోగులకు గుడ్‌న్యూస్- ఐటీఐ అర్హతతో రైల్వేలో 3093 అప్రెంటీస్ జాబ్స్
- ఇగ్నోలో 102 టైపిస్ట్ & స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!
- బీటెక్ విద్యార్థులకు గుడ్‌న్యూస్- BELలో ఇంజినీర్ ఉద్యోగాలు, అప్లైకు కొద్ది రోజులే ఛాన్స్!
- విశాఖ నేవల్ డాక్‌యార్డ్‌లో 275 అప్రెంటీస్ పోస్టులు - అప్లై చేసుకోండిలా!
- NLCలో 295 గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు - అప్లై చేసుకోండిలా!
- ఐటీఐ అర్హతతో రైల్వేలో 1104 అప్రెంటీస్ జాబ్స్- అప్లైకు చివరి తేదీ ఎప్పుడంటే?
- ఐటీఐ అర్హతతో ఇండియన్ నేవీలో 275 అప్రెంటీస్ పోస్టులు - అప్లై చేసుకోండిలా!
- PGCILలో 203 జూనియర్ టెక్నీషియన్ పోస్టులు - అప్లై చేసుకోండిలా!
- డిగ్రీ అర్హతతో SBIలో 5280 CBO పోస్టులు - జీతం ఎంతంటే?
- డిప్లొమా, ఐటీఐ అర్హతతో SAILలో 110 ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!
- ఎస్ఎస్సీ భారీ నోటిఫికేషన్ - పదో తరగతి అర్హతతో 75,768 జీడీ కానిస్టేబుల్ పోస్టులు!
- ఐటీఐ అర్హతతో నార్త్ సెంట్రల్ రైల్వేలో 1697 అప్రెంటీస్ పోస్టులు