Indians to leave Ukraine: రష్యా- ఉక్రెయిన్ మధ్య సంఘర్షణ తీవ్రమవుతోంది. చర్చలకు సై అంటూనే ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా భారీగా సైన్యాన్ని మోహరించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లో ఉంటున్న భారతీయులు.. ముఖ్యంగా బస తప్పనిసరి కాని విద్యార్థులు తాత్కాలికంగా తక్షణం స్వదేశం తిరిగిరావాలని సూచించింది.
ఈ మేరకు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్‌కు అనవసర ప్రయాణాలు కూడా మానుకోవాలని అందులో తెలిపింది. ఈనెల 16న ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశం ఉందని అమెరికా పేర్కొన్న నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా.. రష్యా 16వ తేదీన తమ దేశంపై దాడి చేసే అవకాశం ఉందని తెలిపారు.
ఇవీ చూడండి: ఉక్రెయిన్‌పై రష్యాకు ఎందుకంత కోపం..?