ETV Bharat / bharat

ఏనుగుపై ఇష్టారీతిన దాడి.. ఇద్దరు అరెస్ట్​

తమిళనాడులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గజరాజుల పునర్వికాస కేంద్రంలో ఓ ఏనుగును దారుణంగా కొట్టారు ఇద్దరు వ్యక్తులు. ఈ దృశ్యాలు వైరల్​గా మారాయి. ఘటనకు పాల్పడిన మావటితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్​ చేశారు.

Elephant brutally attacked by Mahout - fired Tamilnadu Government
పునర్వికాస కేంద్రంలో ఏనుగుపై ఇష్టారీతిన దాడి
author img

By

Published : Feb 22, 2021, 5:49 AM IST

Updated : Feb 22, 2021, 6:06 AM IST

తమిళనాడులో ఓ గజరాజును దారుణంగా హింసించారు ఇద్దరు వ్యక్తులు. కోయంబత్తూర్​లోని మెట్టుపాలాయంలో ఏనుగుల ప్రత్యేక పునర్వికాస కేంద్రంలో ఈ ఘటన జరిగింది. గజరాజును మావటి ఇష్టారీతిన కొడుతున్న వీడియో వైరల్​గా మారింది. దాడికి పాల్పడిన వినిల్ కుమార్ అనే మావటిని హిందూ రిలీజియస్ అండ్ ఛారిటబుల్ ఎండోమెంట్స్ (హెచ్ఆర్ అండ్ సిఇ) ట్రస్ట్ తొలగించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మావటితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్​ చేశారు అటవీ శాఖ అధికారులు.

ఏనుగును కొడుతున్న దృశ్యాలు

ఈ కేంద్రానికి రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 26 ఏనుగులతో పాటు శ్రీవిల్లిపుత్తూర్​కు చెందిన ఏనుగు జైమాల్యద కూడా పాల్గొంది. ఆ ఏనుగుపై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడిన వీడియో వైరల్​గా మారింది. ఈ క్రమంలో హెచ్​ఆర్​ అండ్​ సీఈ ట్రస్టు దర్యాప్తు చేపట్టింది. అయితే.. ఏనుగు గొలుసు తెంచుకొని తప్పించుకోవడానికి ప్రయత్నించిందని నిందితులు తెలిపారు. ఈ క్రమంలో మావటి కాలు కూడా తొక్కిందని, అదుపు చేయకపోతే ఇతరులకు ప్రమాదమని భావించి కొట్టినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: అడవుల్లో అగ్గి రాజుకుంటోంది!

Last Updated : Feb 22, 2021, 6:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.