ETV Bharat / bharat

Electricity Bill Scam Message : ఆన్​లైన్​ కరెంట్​ బిల్లు స్కామ్ అంటే ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Electricity Bill Scam Message : ఈ మధ్య తరచుగా సైబర్​ నేరాలు గురించి వింటున్నాం. మోసపూరిత ఫోన్​కాల్స్, మెసేజ్​లకు స్పందించి ఎంతో మంది డబ్బును పోగొట్టుకుంటున్నారు. తాజాగా విద్యుత్ బిల్లులు పేరుతో సైబర్ నేరగాళ్లు చేసే మోసాలు ఎక్కువయ్యాయి. వారి బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

Eelectricity Bill Scam Message
Eelectricity Bill Scam Message
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 28, 2023, 1:54 PM IST

Electricity Bill Scam Message : ప్రస్తుత కాలంలో సాంకేతికతతో కలిగే లాభాలతో పాటు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. గత కొన్నాళ్లుగా సైబర్ ​నేరగాళ్లు కరెంట్ బిల్లుల పేరుతో స్కామ్​లకు పాల్పడుతున్నారు. వారి బారిన పడితే మీ అకౌంట్​లో ఉన్న డబ్బును దోచేస్తారు. విద్యావంతులు, నిరక్షరాస్యులు అనే తేడా లేకుండా అందరినీ వారు బురిడీ కొట్టిస్తున్నారు. సైబర్​ నేరగాళ్లు చేసే ఫోన్​కాల్స్ పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక వేళ వారి నుంచి ఫోన్ వస్తే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అసలేంటి ఈ విద్యుత్​ బిల్లుల స్కామ్​?
ఇంటి కరెంట్​ బిల్లు వెంటనే చెల్లించాలని.. లేదంటే సరఫరాను నిలిపివేస్తామని సైబర్​ నేరగాళ్లు మెసేజ్​లు పంపుతుంటారు. అలాంటి వారి చేతిలో చాలా మంది మోసపోతున్నారు. దీనినే విద్యుత్ బిల్లుల స్కామ్​గా పిలుస్తున్నారు. ఏయే మార్గాల ద్వారా ఇటువంటి స్కామ్​లు జరుగుతున్నాయో తెలుసుకుందాం.

ఫోన్​కాల్స్​ ద్వారా..
ఈ మధ్య కాలంలో ఆన్​లైన్ కరెంట్ ​బిల్లుల మోసాలు ఎక్కువయ్యాయి. సైబర్ మోసగాళ్లు కరెంట్ బిల్లులు చెల్లించాలని కొంతమందికి ఫోన్ చేస్తుంటారు. కరెంట్ ఆఫీస్​ నుంచి కాల్​చేస్తున్నామని చెబుతుంటారు. మీ విద్యుత్​​ బిల్లు బకాయి ఉందని వెంటనే చెల్లించాలి.. లేదంటే కనెక్షన్ కట్​ చేస్తామని భయాందోళనలకు గురిచేస్తుంటారు. వెంటనే మీ ఫోన్​కు పంపిన లింక్​ ద్వారా చెల్లించండని మోసపూరితమైన వెబ్​సైట్​ లింక్​లను పంపుతుంటారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అలాంటి నకిలీ లింక్​లపై క్లిక్ చేయొద్దు.

వాట్సాప్ మెసేజ్​, ఎస్​ఎంఎస్​లతో..
సైబర్​ నేరగాళ్ల ఆన్​లైన్ మోసాలకు ఈ మధ్య వాట్సాప్, ఎస్​ఎంఎస్​లను వేదికగా చేసుకుంటున్నారు. వారు మన ఫోన్​కు సందేశాలు పంపి అకౌంట్​లో డబ్బులను దోచేస్తున్నారు. " ప్రియమైన వినియోగదారులారా.. మీరు గత నెల చెల్లించిన విద్యుత్ బిల్లు అప్​డేట్ అవ్వలేదు. అందువల్ల బిల్లును వెంటనే చెల్లించండి. ఆలస్యమైతే మీ ఇంటికి విద్యుత్ సరఫరాను ఈరోజు రాత్రి 9.30 గంటలకు నిలిపివేస్తాం. మరిన్ని వివరాలకు వెంటనే సంబంధిత అధికారితో మాట్లాడటానికి 82603XXXX42 నంబర్​కు సంప్రదించండి." ఇలాంటి మెసేజ్​ మీకు వాట్సాప్​లో వస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నంబర్​లకు ఫోన్ ​చేయొద్దు.

మోసపూరిత లింక్​ల ద్వారా..
ఈ మధ్య ఫోన్​లకు మోసపూరిత లింక్​లను సైబర్​ నేరగాళ్లు పంపుతున్నారు. వాటినే ఫిషింగ్ అటాక్ అంటున్నారు. వారు పెట్టే లింక్​లు, మెసేజ్​లు అందరినీ నమ్మించేవిగా, మనల్ని కంగారు పెట్టేవిగా ఉంటాయి. వాటిపై క్లిక్ చేయడం వల్ల మన సమాచారం అంతా వారి చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. సైబర్​ నేరగాళ్ల వలలో పడి చాలా మంది మోసపోతున్నారు.

అప్రమత్తతే.. అతిముఖ్యం
ఇప్పటి వరకు సైబర్ ​నేరగాళ్లు ఏవిధంగా మోసాలు చేస్తున్నారో తెలుసుకున్నాం. ఇప్పుడు వారి బారిన పడకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

  • మీకు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్​లు పట్ల జాగ్రత్తగా ఉండండి.
  • సైబర్​ నేరగాళ్లు పంపే వెబ్​సైట్​ లింక్​లపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దు.
  • ఒక వేళ మీకు కరెంట్​ బిల్​పై సందేహాలుంటే దానిపై ఉన్న ఫోన్​ నంబర్​కు సంప్రదించండి.
  • తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్​లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దు.
  • మీకు ఫోన్​కు వచ్చిన అనుమానితంగా మెసేజ్ పట్ల జాగ్రత్తలు వహించాలి.
  • సైబర్​ కేటుగాళ్లు మీకు ఫోన్​ చేసినప్పుడు వ్యక్తిగత వివరాలు కూడా అడిగే అవకాశం ఉంది.
  • మీ వ్యక్తిగత వివరాలను అపరిచితులకు ఇవ్వవద్దు.
  • బ్యాంక్​ అకౌంట్ వివరాలు, మీ చిరునామా వివరాలు అపరిచితులకు పంపవద్దు.

Cyber Cheatings in Patancheru : సైబర్​ నేరగాళ్ల నయా రూట్​.. ఫుడ్​ ఆర్డర్​ క్యాన్సిల్​ చేసినందుకు ఖాతా ఖాళీ

Thane Cyber Fraud : భారీ సైబర్ మోసం.. పేమెంట్ గేట్​వే హ్యాక్.. రూ.16 వేల కోట్లు స్వాహా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.