up road accident news: ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో దారుణం జరిగింది. వేగంగా వచ్చిన ఓ ఎలక్ట్రిక్ బస్ మరో బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మరికొందరికి గాయాలైనట్లు పేర్కొన్నారు. ఈ ఘటన టాట్ మిల్ కూడలి సమీపంలో జరిగినట్లు వివరించారు.
![up road accident news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14326169_acc.jpg)
![up road accident news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14326169_sasa.jpg)
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో స్థానికంగా ఉండే ఆసుపత్రికి తరలించినట్లు డీసీపీ ప్రమోద్‌కుమార్ తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
![up road accident news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14326169_jdskjhjadsld.jpg)
ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాని పేర్కొన్నారు.
-
कानपुर से सड़क हादसे का बहुत ही दुखद समाचार प्राप्त हुआ।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) January 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
मृतकों के परिजनों के प्रति मेरी गहरी शोक संवेदनाएं। मैं ईश्वर से प्रार्थना करती हूं कि घायलों को जल्द स्वास्थ्य लाभ मिले।
">कानपुर से सड़क हादसे का बहुत ही दुखद समाचार प्राप्त हुआ।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) January 30, 2022
मृतकों के परिजनों के प्रति मेरी गहरी शोक संवेदनाएं। मैं ईश्वर से प्रार्थना करती हूं कि घायलों को जल्द स्वास्थ्य लाभ मिले।कानपुर से सड़क हादसे का बहुत ही दुखद समाचार प्राप्त हुआ।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) January 30, 2022
मृतकों के परिजनों के प्रति मेरी गहरी शोक संवेदनाएं। मैं ईश्वर से प्रार्थना करती हूं कि घायलों को जल्द स्वास्थ्य लाभ मिले।
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: 17ఏళ్ల బాలికను బెదిరించి.. నెలలుగా 20 మంది అత్యాచారం!