ETV Bharat / bharat

TMC, CPI, NCPకి ఈసీ షాక్.. జాతీయ పార్టీ హోదా రద్దు.. 'ఆమ్ ఆద్మీ'కి ప్రమోషన్!

టీఎంసీ, సీపీఐ, ఎన్​సీపీ.. జాతీయ పార్టీ హోదాను కోల్పోయాయి. ఆమ్​ ఆద్మీ పార్టీకి కొత్తగా జాతీయ పార్టీ హోదా దక్కింది. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఈమేరకు అధికారిక ప్రకటన చేసింది.

Trinamool Congress national party status

author img

By

Published : Apr 10, 2023, 8:03 PM IST

Updated : Apr 10, 2023, 9:17 PM IST

తృణమూల్ కాంగ్రెస్​ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్​ ఇండియా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. టీఎంసీ, సీపీఐ, ఎన్​సీపీకి జాతీయ పార్టీ హోదా రద్దు చేసింది. సోమవారం ఈమేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో ప్రభంజన విజయం సాధించిన ఆమ్​ఆద్మీ పార్టీకి కొత్తగా.. జాతీయ పార్టీ హోదా ఇస్తున్నట్లు ఈసీ తెలిపింది. ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో.. ప్రస్తుతం భాజపా, బీఎస్పీ, సీపీఎం, కాంగ్రెస్, ఆప్​, నేషనల్​ పీపుల్స్ పార్టీ ఆఫ్ మేఘాలయ జాతీయ పార్టీ హోదా కలిగిన పార్టీలుగా ఉన్నాయి. జాతీయ హోదా కోల్పోయిన ఎన్​సీపీ, టీఎమ్​సీ పార్టీలను.. నాగాలాండ్​, మేఘాలయాల్లో రాష్ట్ర పార్టీలుగా గుర్తించింది.

ఏపీలో బీఆర్​ఎస్​కు చుక్కెదురు...
ఏపీలో రాష్ట్ర పార్టీ గుర్తింపును భారత్‌ రాష్ట్ర సమితి(తెరాస) కోల్పోయింది. తెలంగాణలో మాత్రమే బీఆర్​ఎస్​కు రాష్ట్ర పార్టీగా గుర్తింపు ఉంది. విభజన సమయంలో తెలుగు రాష్ట్రాల్లో తెరాసకు రాష్ట్ర పార్టీగా గుర్తింపు లభించింది. రాష్ట్ర విభజన తర్వాత తెరాస ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేయలేదు. దీంతో ఎన్నికల సంఘం బీఆర్​ఎస్​కు ఆంధ్రప్రదేశ్​లో రాష్ట్ర పార్టీ హోదా రద్దు చేసింది.

పార్టీలు - రాష్ట్ర పార్టీ హోదా కోల్పోయిన రాష్ట్రం :

  • ఆర్​ఎల్​డీ- ఉత్తర్​ప్రదేశ్​
  • బీఆర్​ఎస్​ - ఆంధ్రప్రదేశ్​
  • బీడీఏ - మణిపుర్​
  • పీఎమ్​కే - పుదుచ్చేరి
  • ఆర్​ఎస్​పీ - బంగాల్​
  • ఎం​పీసీ - మిజోరంలో

కొత్తగా గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలు:

  • లోక్​ జనశక్తి పార్టీ(రామ్ విలాస్​)- నాగాలాండ్​
  • వాయిస్​ ఆఫ్​ ది పీపుల్ పార్టీ -​ మేఘాలయ
  • తిప్రా మోథా - త్రిపుర

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలే.. ఇప్పుడు మూడు పార్టీల జాతీయ హోదాను ఈసీ రద్దు చేసేందుకు కారణం. 1968 నాటి ఎన్నికల చిహ్నాలు (రిజర్వేషన్​, కేటాయింపులు) ఉత్తర్వుల ప్రకారం.. ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే... లోక్​సభ లేదా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో... నాలుగు లేదా అంత కంటే ఎక్కువ రాష్ట్రాల్లో పోటీ చేసి ఉండాలి. ఆ పార్టీకి కనీసం 6 శాతం ఓట్లు దక్కాలి. లోక్​సభలో ఆ పార్టీ నుంచి కనీసం నలుగురు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తూ ఉండాలి. మొత్తం లోక్​సభ స్థానాల్లో కనీసం 2 శాతం సీట్లు పొంది ఉండాలి. అలాగే ఆ పార్టీ సభ్యులు కనీసం 3 రాష్ట్రాలకు చెందిన వారై ఉండాలి. 2019 ఎన్నికల్లో.. టీఎంసీ, సీపీఐ, ఎన్​సీపీకి ఈ స్థాయి ఫలితాలు రాలేదు. ఫలితంగా.. జాతీయ పార్టీ హోదా ఎందుకు రద్దు చేయకూడదో 2019 జులైలోనే నోటీసులు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పుడు ఇదే విషయమై నిర్ణయం తీసుకుంది.

మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 34 లోక్​సభ స్థానాల్లో విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో మాత్రం 22 సీట్లకే పరిమితమైంది.
2014లో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్​ ఇండియా- సీపీఐ.. ఒక్క సీటుకే పరిమితమైంది. 2019లో కాస్త పుంజుకుని రెండు సీట్లు దక్కించుకుంది. కానీ బంగాల్, ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని ఎదుర్కొంది. ఫలితంగా జాతీయ పార్టీ హోదాను కోల్పోయింది.
2014 లోక్​సభ ఎన్నికల్లో ఎన్​సీపీకి ఆరు సీట్లు వచ్చాయి. అయితే.. 2019 ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ 5 స్థానాలకే పరిమితమైంది. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లోనూ అంతంతమాత్రం ప్రభావమే చూపింది. అయితే రాజకీయ పార్టీల జాతీయ హోదాను ప్రతి ఐదు సంవత్సరాలకు బదులుగా ప్రతి 10 సంవత్సరాలకు సమీక్షించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.

Last Updated : Apr 10, 2023, 9:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.