Election Commission: ఎన్నికల ర్యాలీలు, రోడ్‌షోలపై విధించిన నిషేధాన్ని ఈనెల 22 వరకు పొడిగిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే రాజకీయ పార్టీలు ఇండోర్ మీటింగ్స్ నిర్వహించుకోవచ్చని తెలిపింది.
హాజరు సంఖ్య 300 మంది కన్నా తక్కువ లేదా హాలులో 50 శాతం ఉండాలని స్పష్టం చేసింది.
అన్ని పార్టీలు కొవిడ్ మార్గదర్శకాలను తప్పక పాటించాలని తెలిపింది.
మున్సిపల్ ఎన్నికలు వాయిదా..
బంగాల్లో కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లలో జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. సిలిగుడీ, ఛాన్దెర్నాగోర్, బిధాన్నగర్, అసన్సోల్ మున్సిపల్ కార్పొరేషన్లలో ఈనెల 22న జరగాల్సిన ఈ ఎన్నికలను ఫిబ్రవరి 12కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజే.. 2,68,833 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 402 మంది మరణించారు. 1,22,684 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 16.66 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇదీ చూడండి : 'అమెరికా ఆస్పత్రి నుంచే కేరళ పాలన.. బైడెన్లా చేయరట!'