ETV Bharat / bharat

ద్రాక్షపండు సైజులో గుడ్లు.. ఈ కోడిపెట్ట ఇప్పుడు సోషల్ మీడియా స్టార్! - పచ్చసొన లేకుండా కోడిగుడ్లు

Eggs in the size of grapes: ద్రాక్ష పండు సైజులో కోడిగుడ్లను ఎప్పుడైనా చూశారా? లేదంటే... కేరళకు వెళ్లాల్సిందే! మలప్పురానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఉన్న ఓ కోడిపెట్ట ద్రాక్షపండ్ల సైజులో గుడ్లు పెడుతోంది.

Eggs in the size of grapes
ద్రాక్ష పండు సైజులో కోడిగుడ్లు
author img

By

Published : Jan 6, 2022, 4:41 PM IST

Updated : Jan 6, 2022, 10:50 PM IST

Eggs in the size of grapes: కోడిగుడ్డు పక్కన ఏవో ఉన్నాయి. వేరే ఏదైనా పక్షి గుడ్లో? లేదా పాము గుడ్లో అని అనుకుంటున్నారా? అలా అనుకుంటే 'గుడ్డు'పై కాలేసినట్లే! ఎందుకంటే.. ఇవన్నీ కోడిగుడ్లే మరి. కేరళ మలప్పురంలోని ఏఆర్​ నగర్ ప్రాంతానికి చెందిన సమద్ అనే వ్యక్తి ఇంట్లో ఉన్న ఐదేళ్ల వయసు ఉన్న కోడిపెట్ట ఇలా వింత ఆకారంలో గుడ్లు పెడుతోంది. ద్రాక్ష పండ్ల సైజులో ఉన్న ఈ కోడిగుడ్లలో తెల్లసొన మాత్రమే ఉండి... పచ్చ సొనలేకపోవడం మరో విశేషం.

Eggs in the size of grapes
ద్రాక్ష పండు సైజులో కోడిగుడ్లు

Small eggs in kerala: కొన్నిరోజుల క్రితం వరకు తమ కోడి మామూలు సైజులోనే గుడ్లను పెట్టేదని సమద్ చెప్పారు. అయితే.. ఇటీవల కొద్దిరోజులుగా ఇలా చాలా చిన్న సైజులో గుడ్లను పెడుతోందని అన్నారు. ఇప్పటివరకు తమ కోడి మొత్తం 9 చిన్న గుడ్లను పెట్టిందని వెల్లడించారు.

Eggs in the size of grapes
సమద్ ఇంట్లో ఉన్న కోడిపెట్ట
Eggs in the size of grapes
సమద్ ఇంట్లో కోడిపెట్ట పెట్టిన గుడ్లు

"నేను ఓ కోడిగుడ్డును పగలగొట్టి చూశాను. అందులో పచ్చసొన లేదు. కేవలం తెల్లసొన మాత్రమే ఉంది. దీనికి కారణమేంటో నాకూ తెలియదు. మా ఇంట్లో ఉన్న మిగతా కోడిగుడ్లకు పెట్టే ఆహారాన్నే ఈ కోడికీ పెడతాం. అయినా ఇలా వింత సైజులో గుడ్లు పెడుతోంది."

-సమద్​, కోడిపెట్ట యజమాని.

సమద్​ ఇంట్లో కోడి పెడుతున్న ఈ చిన్న గుడ్ల ఫొటోలు, వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. దాంతో వీటిని చూసేందుకు చాలా మంది సమద్​ ఇంటికి వస్తున్నారు.

ఇదీ చూడండి: అచ్చంగా.. ఆకుపచ్చంగా.. కోడిగుడ్లు!

ఇదీ చూడండి: పది రూపాయల కోడిపిల్లకు రూ.50 టికెట్​- ఆర్టీసీ కండక్టర్​ ఘనకార్యం!

Last Updated : Jan 6, 2022, 10:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.