ETV Bharat / bharat

ED Raids on Telangana Medical Colleges : రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో రెండో రోజు ఈడీ సోదాలు - హైదరాబాద్ వార్తలు

ED Raids at Telangana Medical colleges : ప్రైవేటు వైద్య కళాశాలల్లో పీజీ సీట్లు బ్లాక్‌ చేసి.. అధిక ధరలకు అమ్ముకున్న తీరుపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే బుధవారం రోజున ప్రారంభించిన ఈడీ సోదాలు రోజు కూడా కొనసాగుతున్నాయి. బుధవారం రోజున రాష్ట్రవ్యాప్తంగా 9 ప్రైవేటు వైద్యకళాశాలలకు సంబంధించి 16 ప్రాంతాల్లో ఈడీ బృందాలు ఏక కాలంలో సోదాలు చేశాయి. సీఆర్​పీఎఫ్, ఆర్​ఏఎఫ్ బలగాలు ఈడీ బృందాలకు రక్షణ కల్పించాయి. కళాశాలల్లో కీలక ప్రతినిధుల్ని బయటికి వెళ్లనీయకుండా ఆపిన ఈడీ బృందాలు.. ఉదయం నుంచి రాత్రివరకు తనిఖీలు కొనసాగించాయి.

ED Focus on Telangana Private Medical Colleges

author img

By

Published : Jun 22, 2023, 9:15 AM IST

పీజీ సీట్ల బ్లాక్‌ దందాలో అక్రమార్జనపై ఈడీ నజర్‌

ED Focus on Telangana Private Medical Colleges : రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో పీజీ సీట్ల వ్యవహారంపై ఈడీ అధికారులు దృష్టి సారించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ఈడీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు ఈరోజు కూడా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం హైదరాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, ఖమ్మం, రంగారెడ్డి, నల్గొండ తదితర ప్రాంతాల్లోని వైద్య కళాశాలలతోపాటు నిర్వాహకుల కార్యాలయాలు, ఇళ్లల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు.

హైదరాబాద్‌లో మల్లారెడ్డి, కామినేని, మెడిసిటీ, ప్రతిమ సంస్థ కార్పొరేట్‌ కార్యాలయం, కరీంనగర్‌లోని ప్రతిమ, మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్, నల్గొండలోని కామినేని, ఖమ్మంలోని మమత, రంగారెడ్డిలోని పట్నం మహేందర్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, సంగారెడ్డిలోని ఎంఎన్​ఆర్ వైద్య కళాశాలల్లో ఈ సోదాలు జరిగాయి. ప్రైవేటు వైద్య కళాశాలల నిర్వాహకులు పీజీ సీట్లను ప్రణాళిక ప్రకారం బ్లాక్‌ చేసి.. భారీ మొత్తానికి విక్రయించారంటూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు.. గతేడాది ఏప్రిల్‌లో వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మట్టేవాడ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగానే తాజాగా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు.

ED Raids On Telangana Medical Colleges : సీట్లు అమ్ముకున్న సొమ్ముతో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే కోణంలో దర్యాప్తు ఆరంభించింది. వందల కోట్లు చేతులు మారి ఉంటాయని అనుమానిస్తున్న ఈడీ.. ఆ సొమ్మును ఎక్కడికి మళ్లించారనే విషయంపై కూపీ లాగుతోంది. సోదాలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు.. కొందరు మెరిట్‌ విద్యార్థులు, దళారులతో కుమ్మక్కై.. పీజీ సీట్ల బ్లాకింగ్‌ దందాకు పాల్పడ్డాయనేది ప్రధాన ఆరోపణ. ముందుగానే ఓ కళాశాలలో కన్వీనర్‌ కోటాలో పీజీ సీటు పొందిన విద్యార్థి.. మరో కళాశాలలోనూ చివరి విడత కౌన్సెలింగ్‌ వరకు సీటు బ్లాక్‌ చేయడమే ఈ దందాలో కీలకం. అలా చివరి వరకు ఆ సీటు బ్లాక్‌ అయి ఉండటంతో మిగిలిన విద్యార్థులు ఆ సీటు పొందే అవకాశం ఉండదు.

ED Raids Second day on Telangana Private Medical Colleges : మిగిలిపోయే సీటును కళాశాల నిర్వాహకులు సొంతంగా భర్తీ చేసుకునే వెలుసుబాటు ఉంటుంది. అలా పెద్దమొత్తంలో డబ్బు తీసుకొని సీట్లను విక్రయించారనేది కొన్ని ప్రైవేటు కళాశాలలపై కాళోజీ వర్సిటీ వర్గాలు మోపిన అభియోగం. గత ఏడాది 45 సీట్లు పక్కదారి పట్టినట్లు వర్సిటీ వర్గాల అంతర్గత విచారణలో తేలింది. సీట్లను బ్లాక్‌ చేసిన విద్యార్థుల నుంచి కాళోజీ వర్సిటీ వివరణ కోరింది. అందులో ఏడుగురు విద్యార్థులు తాము అసలు దరఖాస్తే చేయలేదని వివరణ ఇవ్వడంతో వర్సిటీ వర్గాలు కంగుతిన్నాయి. పెద్దమొత్తంలో దందా జరిగిందని అనుమానించి వరంగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగానే ఈడీ రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది.

ED Focus on Private Medical Colleges : నీట్‌ పీజీలో అర్హులైన అభ్యర్థులతో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోనే కన్వీనర్‌, యాజమాన్య, ప్రవాస భారతీయ, వైద్య సంస్థ కోటా సీట్లను భర్తీ చేయాల్సి ఉంటుంది. యాజమాన్య కోటాలో ఒక్కో పీజీ సీటుకు 24 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రవాస భారతీయ, వైద్య సంస్థ కేటగిరీలో అయితే యాజమాన్య కోటా రుసుము కంటే గరిష్ఠంగా మూడింతల వరకు చెల్లించాలి. అంటే ఒక్కో సీటుకు 72 లక్షల వరకు కట్టాల్సిందే. పరిస్థితిని బట్టి కళాశాల ఎంత డిమాండ్‌ చేస్తే అంత ఇవ్వాల్సిందే. ఆరోగ్య వర్సిటీ అన్ని విడతల కౌన్సెలింగ్‌లు పూర్తయ్యాక సీట్లు మిగిలితే.. ఆ సీట్లను ప్రైవేటు కళాశాల సొంతంగా భర్తీ చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నిబంధనను అడ్డం పెట్టుకొనే కొన్ని కళాశాలలు సీట్లు అమ్ముకొంటున్నాయని ఆరోపణ.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.