ED Raid Senthil Balaji : మనీలాండరింగ్ కేసులో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీని అరెస్టు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్. అనేక గంటల పాటు ఆయన్ను విచారించిన ఈడీ.. చివరకు అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. మంగళవారం తమిళనాడు సచివాలయంలోని ఆయన కార్యాలయంతో సహా, చెన్నైలో మంత్రి ఇంట్లోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. తరువాత మంత్రిని సుదీర్ఘ కాలం పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు.. అర్ధరాత్రి తరువాత ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఆయనను ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి, కస్టడీ కోరే అవకాశం ఉంది. మంత్రి అరెస్ట్ నేపథ్యంలో ఎలాంటి ఆందోళనలు చెలరేగకుండా కరూర్‌లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.
-
#WATCH | Karur, Tamil Nadu: Heavy security deployment near Karur bus stand after ED has taken Tamil Nadu Electricity Minister Senthil Balaji into custody pic.twitter.com/M3VL8yb7U9
— ANI (@ANI) June 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Karur, Tamil Nadu: Heavy security deployment near Karur bus stand after ED has taken Tamil Nadu Electricity Minister Senthil Balaji into custody pic.twitter.com/M3VL8yb7U9
— ANI (@ANI) June 14, 2023#WATCH | Karur, Tamil Nadu: Heavy security deployment near Karur bus stand after ED has taken Tamil Nadu Electricity Minister Senthil Balaji into custody pic.twitter.com/M3VL8yb7U9
— ANI (@ANI) June 14, 2023
ఆసుపత్రిలో చేరిన మంత్రి
అంతకుముందు మంత్రి వి.సెంథిల్ బాలాజీని వైద్య పరీక్షల కోసం చెన్నై ఒమండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో మంత్రి తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. మంత్రి అరెస్టు గురించి తెలుసుకున్న తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్, క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్, ఇంకా పలువురు డీఎంకే మంత్రులు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకుని సెంథిల్ బాలాజీని పరామర్శించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సెంథిల్ బాలాజీనిని టార్చర్ చేయడం వల్లనే.. ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని డీఎంకే పార్టీ నేతలు ఆరోపించారు.
-
Chennai | Senthil Balaji is undergoing treatment. We will deal with it legally. We are not afraid of the threatening politics of the BJP-led central government: Tamil Nadu Minister Udhayanidhi Stalin https://t.co/o8C8Mca3RH pic.twitter.com/5ybLmiqsPH
— ANI (@ANI) June 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Chennai | Senthil Balaji is undergoing treatment. We will deal with it legally. We are not afraid of the threatening politics of the BJP-led central government: Tamil Nadu Minister Udhayanidhi Stalin https://t.co/o8C8Mca3RH pic.twitter.com/5ybLmiqsPH
— ANI (@ANI) June 13, 2023Chennai | Senthil Balaji is undergoing treatment. We will deal with it legally. We are not afraid of the threatening politics of the BJP-led central government: Tamil Nadu Minister Udhayanidhi Stalin https://t.co/o8C8Mca3RH pic.twitter.com/5ybLmiqsPH
— ANI (@ANI) June 13, 2023
"బీజేపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోంది. ఇలాంటి వాటికి మేము భయపడేది లేదు. మంత్రి వి.సెంథిల్ బాలాజీ ట్రీట్మెంట్ కొనసాగుతోంది. ఈడీ దాడులపై మేము న్యాయపోరాటం చేస్తాం."
- ఉదయనిధి స్టాలిన్, మంత్రి
"ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్న బాలాజీని చూశాను. ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారు. పిలిచినా పలకడం లేదు. ఆయన చెవుల్లోంచి రక్తం కారుతోంది. డాక్టర్లు ఈసీజీ వల్ల అలా జరిగిందని అంటున్నారు. కానీ సెంథిల్ బాలాజీని ఈడీ అధికారులు చిత్రహింసలకు గురిచేసినట్లు కనిపిస్తోంది."
- పీకే శేఖర్‌బాబు, మంత్రి
రాజకీయ వేధింపులకు భయపడేది లేదు
తమిళనాడు విద్యుత్‌శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ఖండించారు. "ఇది మోదీ ప్రభుత్వం తమను వ్యతిరేకించేవారిపై రాజకీయ వేధింపులకు, బెదిరింపులకు పాల్పడడం తప్ప మరొకటి కాదు. విపక్షంలోని ఏ ఒక్కరూ ఇలాంటి దుందుడుకు దుష్చర్యలకు భయపడేది లేదు." అని ఆరోపించారు.
-
Congress President Mallikarjun Kharge condemns the late-night arrest of Tamil Nadu Minister Senthil Balaji by the Enforcement Directorate
— ANI (@ANI) June 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
"This is nothing but political harassment and vendetta by the Modi govt against those opposed to it. None of us in the Opposition will be… pic.twitter.com/4Jz189eqwS
">Congress President Mallikarjun Kharge condemns the late-night arrest of Tamil Nadu Minister Senthil Balaji by the Enforcement Directorate
— ANI (@ANI) June 14, 2023
"This is nothing but political harassment and vendetta by the Modi govt against those opposed to it. None of us in the Opposition will be… pic.twitter.com/4Jz189eqwSCongress President Mallikarjun Kharge condemns the late-night arrest of Tamil Nadu Minister Senthil Balaji by the Enforcement Directorate
— ANI (@ANI) June 14, 2023
"This is nothing but political harassment and vendetta by the Modi govt against those opposed to it. None of us in the Opposition will be… pic.twitter.com/4Jz189eqwS
బ్యాక్‌డోర్ బెదిరింపులు
అంతకుముందు మంత్రి సెంథిల్ బాలాజీ నివాసాల్లో ఈడీ సోదాలు చేయడంపై డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విరుచుకుపడ్డారు. బీజేపీ బ్యాక్‌డోర్ బెదిరింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడులో పర్యటించిన రెండు రోజుల తర్వాత ఇలాంటి పరిణామం జరగడం ఏమిటని స్టాలిన్ ప్రశ్నించారు.
'క్యాష్ ఫర్ జాబ్' ఉద్యోగాల కుంభకోణంపై పోలీసు, ఈడీ విచారణకు సుప్రీంకోర్టు అనుమతించిన కొన్ని నెలల తర్వాత ఇలా దాడులు చేపట్టారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమిళనాడు విద్యుత్‌శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ కార్యాలయంలో, ఈరోడ్లోనూ, మంత్రి సొంత ఊరు కరూర్‌లోని నివాసంతో సహా, అతని అనుచరుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించింది. సెంథిల్ బాలాజీ ఇంతకుముందు ఏఐఏడీఎంకే పార్టీలో పనిచేశారు. ఆయన దివంగత జయలలిత క్యాబినెట్లో రవాణాశాఖ మంత్రిగానూ పనిచేశారు.
ఇవీ చదవండి :