ECIL Recruitment 2023 Notification : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్).. తమ సంస్థలో పలు అప్రెంటిస్‌షిప్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లోనే ఉన్న ఈ సంస్థలో మొత్తం 484 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఎంపికైన వారికి 2023 సంవత్సరం నాటికి ట్రేడ్ అప్రెంటిస్షిప్లో భాగంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది. అందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అప్రెంటిస్‌షిప్ శిక్షణకు సంబంధించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
ఖాళీల వివరాలు..
- ఈఎం- 190
- ఎలక్ట్రీషియన్- 80
- ఫిట్టర్- 80
- ఆర్ అండ్ ఏసీ- 20
- టర్నర్- 20
- మెషినిస్ట్- 15
- మెషినిస్ట్(జి)- 10
- సీఓపీఏ- 40
- వెల్డర్- 25
- పెయింటర్- 4
- మొత్తం ఖాళీల సంఖ్య: 484
అర్హతలు..
ECIL Apprenticeship 2023 Eligibility Criteria : అభ్యర్థికి 2023 అక్టోబర్ 31 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండాలని తెలిపింది ఈసీఐఎల్. సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత పొంది ఉండాలని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థికి ఒక సంవత్సరం పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ట్రైనింగ్ సమయంలో నెలకు రూ. 7,700 నుంచి రూ.8,050 వరకు స్టైపెండ్ అందిస్తామని తెలిపిన ఈసీఐఎల్.. ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని వెల్లడించింది.
ముఖ్య తేదీలు..
ECIL Apprenticeship 2023 Apply Online Dates
- ఆన్‌లైన్ దరఖాస్తు, రిజిస్ట్రేషన్ ప్రారంభం: 2023 సెప్టెంబర్ 25
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.10.2023 అక్టోబర్ 10
- ధ్రువపత్రాల పరిశీలన తేదీలు: 2023 అక్టోబర్ 16 నుంచి 21 వరకు.
- ప్రవేశానికి గడువు తేదీ: 2023 అక్టోబర్ 10
- అప్రెంటిస్‌షిప్ శిక్షణ ప్రారంభ తేది : 2023 నవంబర్ 1
ECIL Recruitment ITI 2023 : అన్ని ఎంపిక పక్రియలు పూర్తైన తరువాత హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, టీఐఎఫ్‌ఆర్ రోడ్, ఈసీఐఎల్ వంటి తదితర ప్రదేశాల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందని సంస్థ తెలిపింది. పూర్తి సమాచారం కోసం తమ అధికారిక వెబ్సైట్ ecil.co.inను సందర్శించాలని సూచించింది ఈసీఐఎల్.