అసోంలో మొదటి విడత ఎన్నికలు జరిగిన అన్ని(47) సీట్లలో గెలుస్తామన్న భాజపా ప్రకటనను హెడ్లైన్ రూపంలో ప్రచురించిన 8 వార్తా పత్రికలకు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల నియమావళి, 1951 ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఈ పత్రికలు ఉల్లంఘించాయని కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు ఈసీ చర్యలకు ఉపక్రమించింది.
వార్తా పత్రికల యాజమాన్యాలు తమ స్పందనను సోమవారం సాయంత్రం 7 గంటల్లోగా తెలియజేయాలని అసోం ఎన్నికల ప్రధాన అధికారి రిపున్ బోరా ఆదేశించారు. అయితే, దీనిపై పత్రికలు తమ స్పందనను ఇప్పటికే పంపించాయని అధికారులు వెల్లడించారు. న్యూస్పేపర్లతో పాటు అసోం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రంజిత్ కుమార్‌పైనా.. కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.
ఇదీ చదవండి: భాజపా కార్యకర్త తల్లి మృతిపై రాజకీయ దుమారం