ఈ నెల 10న నందిగ్రామ్ ప్రచారంలో బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాలికి గాయమైన ఘటనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదిక పట్ల.. కేంద్ర ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ నివేదిక ఓ పథకం ప్రకారం తయారు చేసినట్లుగా ఉందని పేర్కొంది. ఘటన ఎలా జరిగింది, దాని వెనక ఎవరు ఉన్నారు అనే వివరాలు అందులో లేవని తెలిపింది.
ఆ సమయంలో చాలా మంది ప్రజలు ఉన్నారని నివేదికలో పేర్కొన్నారన్న ఎన్నికల సంఘం.. దీనికి కారణం అని మమతా బెనర్జీ ఆరోపించిన నలుగురైదుగురు వ్యక్తుల ప్రస్తావన మాత్రం అందులో లేదని ఈసీ పేర్కొంది. ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా సమర్పించలేదని తెలిపింది. మరిన్ని వివరాలు సమర్పించాలని బంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అల్పన్ బంధోపాధ్యాయను ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఇదీ చూడండి:- 'మమతపై దాడి' సీసీటీవీ ఫుటేజ్ విడుదల!