ETV Bharat / bharat

బంగాల్​లో ఉద్రిక్తత- అక్కడ పోలింగ్​ వాయిదా

బంగాల్​ కూచ్​బెహార్​ జిల్లాలోని పోలింగ్​ కేంద్రం నెం.126 వద్ద ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. అక్కడ పోలింగ్​ను వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 5 గంటల లోపు ఈ ఘటనపై తమకు పూర్తి నివేదిక అందించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిని ఆదేశించింది.

EC orders adjournment of polls at polling station no. 126 in West Bengal's Sitalkuchi
ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆ కేంద్రంలో పోలింగ్​ వాయిదా
author img

By

Published : Apr 10, 2021, 2:42 PM IST

బంగాల్​లో.. కూచ్​బెహార్​ జిల్లా సీతల్​​కుచి నియోజకవర్గంలోని పోలింగ్​ కేంద్రం నెం. 126 వద్ద కాల్పులు జరిగిన క్రమంలో అక్కడ పోలింగ్​ను వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల సంఘం. దానితో పాటు సాయంత్రం 5 గంటల లోపు ఈ ఘటనపై తమకు పూర్తి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల అధికారిని ఆదేశించింది.

బంగాల్​లో నాలుగో విడత పోలింగ్​ జరగుతున్న వేళ​ కూచ్​బెహార్​ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఐఎస్​ఎఫ్​ బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. సీతల్​​కుచి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు తమ రైఫిళ్లను లాక్కునేందుకు యత్నించగా కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి : 'దీదీ.. హింసతో భాజపా విజయాన్ని అడ్డుకోలేరు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.