బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ బహిరంగ సభలో భాజపా నేత సువేందు అధికారి చేసిన 'మినీ పాకిస్థాన్' వ్యాఖ్యలను ఎన్నికల సంఘం తప్పుపట్టింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నప్పుడు బహిరంగ సభల్లో అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించింది.
మార్చి29న నందిగ్రామ్‌లో జరిగిన ప్రచారంలో విద్వేష పూరిత ప్రసంగం చేశారని సీపీఐ(ఎంఎల్) కేంద్రం కమిటీ నేత కవితా కృష్ణన్ ఆరోపిస్తూ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన ఎన్నికల సంఘం సువేందుకు నోటీసులు పంపింది. ఆయన వాదనలు విన్న ఈసీ హెచ్చరించి వదిలేసింది.
"బేగంకు ఓటు వేయకండి. బేగంకు ఓటేస్తే.. బంగాల్ మినీ పాకిస్థాన్‌లా మారిపోతుంది." అని సువేందు ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయిన మమతా బెనర్జీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.
ఇదీ చూడండి: మమతXసువేందు: నందిగ్రామ్‌లో మాటల తూటాలు