ETV Bharat / bharat

అసోం మంత్రికి ఈసీ షాక్​.. ప్రచారంపై నిషేధం

బోడోలాండ్​ పీపుల్స్​ ఫ్రంట్​ అధినేతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం మంత్రి, భాజపా నేత హిమంత బిశ్వ శర్మ 48 గంటల పాటు ప్రచారం చేయకుండా ఈసీ నిషేధం విధించింది. హిమంత సమాధానం సంతృప్తికరంగా లేదని తెలిపింది.

Himanta Biswa sarma
హిమంత బిశ్వ శర్మ
author img

By

Published : Apr 3, 2021, 5:13 AM IST

అసోం అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర మంత్రి, భాజపా కీలక నేత హిమంత బిశ్వ శర్మకు ఎన్నికల సంఘం షాకిచ్చింది. 48 గంటలపాటు ప్రచారం నిర్వహించకుండా నిషేధం విధించింది. బోడోలాండ్​ పీపుల్స్​ ఫ్రంట్​ అధినేత హగ్రామ మోహిలారీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తెలిపింది.

" ఎన్నికలకు సంబంధించి.. 48 గంటల పాటు ఎలాంటి బహిరంగ సభలు, ప్రజా సమావేశాలు, ర్యాలీలు, రోడ్​ షోలు, ఇంటర్వ్యూలు, మీడియా (ఎలక్ట్రానిక్​, ప్రింట్​ మీడియా, సామాజిక మాధ్యమాలు) వేదికగా ప్రకటనలు చేయకూడదని బిశ్వ శర్మపై ఆంక్షలు విధించింది కమిషన్​. "

- ఎన్నికల సంఘం

ఈసీ ఆంక్షలతో ఏప్రిల్​ 4 వరకు ప్రచారానికి దూరం కానున్నారు హిమంత. ఏప్రిల్​ 4 సాయంత్రంతో తుది దశ పోలింగ్​ ప్రచారానికి తెరపడనుండటం గమనార్హం. ఏప్రిల్​ 6న పోలింగ్​ జరగనుంది.

ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లు ఈసీ ఇచ్చిన నోటీసులపై స్పందించారు హిమంత. తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. అయితే.. శర్మా సమాధానం ఆమోదయోగ్యంగా లేదని ఈసీ తెలిపింది.

తిరుగుబాటు నేత ఎం బాథాతో కలిసి కుట్రలకు పాల్పడితే ఎన్​ఐఏ ద్వారా మోహిలరీ జైలుకు వెళుతారని బెదిరింపులకు పాల్పడ్డారని పోర్కొంటూ ఈసీని ఆశ్రయించింది కాంగ్రెస్​. హిమంత శర్మపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేసింది. ఈక్రమంలో ఈసీ నిషేధం విధించింది.

ఇదీ చూడండి: భాజపా నేత కారులో ఈవీఎం- రీపోలింగ్​కు ఈసీ ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.