ETV Bharat / bharat

దిల్లీలో భూకంపం.. భయంతో జనం పరుగులు.. ఆ ప్రాంతంలోనూ ప్రకంపనలు - ఉత్తరాఖండ్‌లో భూకంపం

దిల్లీలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.4గా నమోదైంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

earthquake in delhi
earthquake in delhi
author img

By

Published : Nov 12, 2022, 8:22 PM IST

Updated : Nov 12, 2022, 9:15 PM IST

దిల్లీలో స్వల్ప స్థాయి భూకంపం సంభవించింది. శనివారం రాత్రి 8 గంటల సమయంలో దిల్లీ-ఎన్​సీఆర్ ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైంది. భూప్రకంపనలు రాగానే.. స్థానికులు బెంబేలెత్తిపోయారు. వెంటనే ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అటు రిషికేశ్​లోనూ ప్రకంపనలు వచ్చాయి.

అయితే నేపాల్​లో సంభవించిన భూకంపం ధాటికి దిల్లీలో ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ భుకంపం ఉత్తరాఖండ్‌లోని జోషిమత్‌కు ఆగ్నేయంగా 212 కిలోమీటర్ల దూరంలో నేపాల్‌లో సంభవించింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉందని సమాచారం. ఈ ప్రభావానికి ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్, మున్సియరీ, గంగోలిహాట్‌ తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. మూడురోజుల క్రితం నేపాల్​లో వచ్చిన భూకంపం రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో నమోదైంది. ఆ సమయంలో నేపాల్​లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 12, 2022, 9:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.