Earthquake in Tamil Nadu: తమిళనాడులోని వెల్లూరులో భూమి స్వల్పంగా కంపించింది. ఐదు నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూప్రకంపనలు సంభవించినట్లు గుడియాతమ్ ప్రాంత స్థానికులు తెలిపారు. భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీసినట్లు చెప్పారు. వెల్లూరులో గత నెల రోజుల వ్యవధిలోనే భూకంపం రావడం ఇది మూడోసారి.
![Earthquake in Tamil Nadu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14008991_img1-2.jpg)
వెల్లూరులో గత నవంబర్ 29న భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రత నమోదైంది. రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో డిసెంబర్ 23న మరోసారి భూమి కంపించింది. జిల్లాలో వరుస భూకంపాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
![Earthquake in Tamil Nadu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14008991_img1-1.jpg)
Earthquake In Karnataka:
కర్ణాటకలోనూ ఇటీవల వరుసగా భూకంప ఘటనలు వెలుగుచూశాయి. చిక్కబళ్లాపుర జిల్లాలో డిసెంబర్ 23న భూకంపం సంభవించింది. బెంగళూరుకు 60 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేల్‌పై 3.6 తీవ్రత నమోదైనట్లు కేఎస్‌ఎన్‌డీఎంసీ అధికారులు తెలిపారు. జిల్లాలోని సదెనహళ్లి, బీరగనహళ్లి, సెట్టిగేర్ గ్రామాలకు 1.2 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కర్ణాటకలోని బెంగళూరు ఉత్తర ఈశాన్య ప్రాంతంలో డిసెంబర్ 22న ఉదయం భూకంపం సంభవించింది. చిక్కబళ్లాపుర జిల్లాలోని ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్‌పై 2.9, 3.0 తీవ్రతతో రెండుసార్లు భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. భూ ప్రకంపనలతో ఆందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు.
ఇదీ చదవండి: రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో నలుగురు ముష్కరులు హతం
ఒకే స్కూల్లో 19 మంది విద్యార్థులకు కరోనా- అక్కడ ఒమిక్రాన్ కలవరం