ETV Bharat / bharat

బిహార్​, అసోంలో భూకంపం- సీఎంకు మోదీ ఫోన్​

author img

By

Published : Apr 28, 2021, 8:21 AM IST

Updated : Apr 28, 2021, 4:18 PM IST

बिहार के कई हिस्सों में भूकंप के झटके

Earthquake
బిహార్​, అసోంలో భూప్రకంపనలు

08:18 April 28

బిహార్​, అసోంలో భూకంపం- సీఎంకు మోదీ ఫోన్​

Earthquake news
బిహార్​, అసోంలో భూప్రకంపనలు

ఈశాన్య భారతాన్ని భారీ భూకంపం వణికించింది. బిహార్​లో 6.7 తీవ్రతో భూమి కంపించింది. అసోంలోని సోనిత్‌పూర్‌లో.. రిక్టర్‌ స్కేలుపై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జాతీయ భూవిజ్ఞాన కేంద్రం తెలిపింది. భూకంప కేంద్రం సోనిత్‌పూర్‌ జిల్లాలోని తేజ్‌పుర్‌కు 43 కిలోమీటర్ల దూరంలో 17 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు పేర్కొంది. ఉదయం 7గంటల 51 నిమిషాల ప్రాంతంలో భూమి మూడు సార్లు కంపించినట్లు తెలిపింది. 7గంటల 58 నిమిషాల ప్రాంతంలో 4.3 తీవ్రతతో 8 గంటల ఒక్క నిమిషం ప్రాంతంలో 4.4 తీవ్రతతో భూమి కంపించినట్లు వివరించింది. 

బంగాల్‌ సహా ఇతర ఈశాన్య రాష్ట్రాలు మేఘాలయలోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు కూడా  జాతీయ భూవిజ్ఞాన కేంద్రం తెలిపింది. భూమి మూడుసార్లు కంపించినట్లు వెల్లడించింది. భూకంపానికి భయాందోళనకు గురైన స్థానికులు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రతకు గువహటిలో కొన్ని చోట్ల భవంతులు దెబ్బతిన్న చిత్రాలను అసోం ఆరోగ్య మంత్రి హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేశారు. భూకంపం ధాటికి ఇప్పటి వరకూ ఏ విధమైన ప్రాణనష్టం జరిగిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. స్థానిక యంత్రాగం నుంచి సమాచారం సేకరిస్తున్నామని సహాయచర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించామని హిమంత వివరించారు. సామాజిక మాధ్యమాల్లో తన ఇళ్లు భూకంప తీవ్రతకు బీటలు వారాయంటూ కొందరు ఫొటోలు పెడుతున్నారు.

బంగాల్‌, మేఘాలయల్లోనూ దీని ప్రభావం కనిపించింది. అక్కడా ప్రకంపనలు సంభవించాయి.

సీఎం విజ్ఞప్తి..

అసోంలో భారీ భూకంపం సంభవించిందని పేర్కొన్న ముఖ్యమంత్రి సర్బానంద సోనావాల్​.. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారుల నుంచి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు.

మోదీ ఫోన్​...

అసోంలో భూకంపంపై సీఎం సర్బానంద సోనోవాల్​తో ఫోన్లో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ. కేంద్రం నుంచి సాధ్యమైనంత సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ట్వీట్​ చేశారు. హోంమంత్రి అమిత్​ షా కూడా సోనోవాల్​కు ఫోన్​ చేశారు.

Last Updated : Apr 28, 2021, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.