ETV Bharat / bharat

లండన్​లో జైశంకర్ వరుస సమావేశాలు - విదేశాంగ మంత్రి జైశంకర్ సమావేశాలు జీ7

జీ7 విదేశాంగ మంత్రుల సమావేశం కోసం లండన్​కు వెళ్లిన భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్.. వివిధ దేశాల ప్రతినిధులు, మంత్రులతో వరుస చర్చలు జరిపారు. ఐరోపా సమాఖ్య ప్రతినిధితో సమావేశమైన ఆయన.. అఫ్గాన్​లో శాంతి స్థాపనపై చర్చించారు. ఫ్రాన్స్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రులతోనూ భేటీ అయ్యారు.

JAISHANKAR-BILATERALS
లండన్​లో జైశంకర్ వరుస సమావేశాలు
author img

By

Published : May 5, 2021, 5:19 AM IST

ఐరోపా సమాఖ్య ప్రతినిధులతో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ సమావేశమయ్యారు. జీ7 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం కోసం లండన్ వెళ్లిన ఆయన.. ఈయూ విదేశీ వ్యవహారాలు, భద్రతా విధానాల విభాగ ప్రతినిధి జోసెఫ్ బోరెల్​ ఫాంటెల్స్​తో భేటీ అయ్యారు. ఇండో పసిఫిక్, అఫ్గానిస్థాన్ అంశాలపై వీరిరువురు చర్చించారు.

అఫ్గాన్​లో కాల్పుల విరమణ తక్షణమే అమలు కావాలని ఇరువురు స్పష్టం చేశారు. భారత్, ఈయూ దేశాల భద్రతకు విఘాతం కలిగించేలా అఫ్గాన్​ నేలను ఉగ్రవాదులు ఉపయోగించకుండా చర్యలు తీసుకోవడం అత్యవసరమని అన్నారు. మానవహక్కుల కార్యకర్తలు, పాత్రికేయుల లక్ష్యంగా జరుగుతున్న దాడులను ఖండించారు. శాంతిని నెలకొల్పే ప్రక్రియలో తాలిబన్లు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

అనంతరం, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రులు జీన్ లెడ్రయాన్, మారీస్ పేన్​లతో జైశంకర్.. త్రైపాక్షిక చర్చలు జరిపారు. కరోనా విషయంలో భారత్​కు ఆయా దేశాలు అందించిన సహకారం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో పరిస్థితులపై చర్చించినట్లు జైశంకర్ తెలిపారు. మూడు దేశాలు పరస్పరం సహకరించుకోవాల్సిన అంశంపై సమాలోచనలు చేసినట్లు చెప్పారు.

ఇదీ చదవండి: 'కరోనాపై పోరులో భారత్​కు అండగా ఐరాస'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.