ETV Bharat / bharat

పన్నీర్​సెల్వంకు ఎదురుదెబ్బ.. ఇక ఆ పదవి మాయం! - ఏఐడీఎంకే జనరల్​ మీటింగ్

AIADMK general council meeting: అన్నాడీఎంకే పార్టీలో ద్వంద్వ నాయకత్వం రద్దు అయినట్లు ప్రకటించారు ఆ పార్టీ సీనియర్​ నేత షణ్ముగం. గురువారం జరిగిన పార్టీ జనరల్​ కౌన్సిల్ సమావేశంలో ఈ పోస్టులకు ఆమోదం తెలపక పోవడం వల్ల రద్దు అయినట్లు తెలిపారు. వీరిద్దరు పాత పదవుల్లోనే కొనసాగుతారని ఆయన చెప్పారు.

aiadmk crisis
aiadmk crisis
author img

By

Published : Jun 24, 2022, 5:35 PM IST

Updated : Jun 24, 2022, 7:29 PM IST

AIADMK general council meeting: తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకేలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పార్టీలో ద్వంద్వ నాయకత్వ వ్యవస్థ రద్దైనట్లు ప్రకటించారు ఆ పార్టీ సీనియర్​ నేత షణ్ముగం. గురువారం జరిగిన పార్టీ జనరల్​ కౌన్సిల్ సమావేశంలో ఈ పోస్టులకు ఆమోదం తెలపక పోవడం వల్ల రద్దు అయినట్లు తెలిపారు. పార్టీలోని రెండు ప్రధాన పదవులకు సంబంధించిన ఈ సవరణలను 2021డిసెంబర్ 1న చేశారు. అనంతరం కోఆర్డినేటర్​గా పన్నీర్​సెల్వం, జాయింట్​ కోఆర్డినేటర్​గా పళనిస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సవరణల ప్రకారం ఈ పదవులకు ఎన్నిక కావాలంటే పార్టీ ప్రాథమిక సభ్యుల ఓటు అవసరం. కానీ ఈ సవరణలను జనరల్​ కౌన్సిల్​ ఆమోదించినందున.. పన్నీర్ సెల్వం కోఆర్డినేటర్, పళనిస్వామి జాయింట్​ కోఆర్డినేటర్​ పోస్టులు రద్దైనట్లు ఆయన వెల్లడించారు. వీరు తమ పాత పోస్టుల్లోనే కొనసాగుతారని పేర్కొన్నారు. అంతకుముందు పన్నీర్​సెల్వం కోశాధికారి హోదాలో ఉండగా.. పళనిస్వామి కేంద్రకార్యాలయ కార్యదర్శిగా ఉన్నారు. మరోవైపు జులై 11న జరిగే జనరల్​ కౌన్సిల్​ సమావేశంలో పళనిస్వామిని నాయకుడిగా ఎన్నుకునేందుకు ఆయన వర్గం పావులు కదుపుతోంది.

గురువారం జరిగిన సమావేశంలో ఒకరి నాయకత్వంలోనే పార్టీ నడవడానికే పళనిస్వామి(ఈపీఎస్)​ క్యాంప్​కు ఎక్కువ మంది నేతలు మొగ్గు చూపారు. దీంతో​ సమావేశం మధ్యలోనే పార్టీ సమన్వయకర్త​ పన్నీర్​ సెల్వం తన మద్దతుదారులతో వాకౌట్​ చేశారు. పార్టీ డిప్యూటీ సెక్రటరీ ఆర్​.వైతిలింగంతో సహా ఓపీఎస్​ మద్దతుదారులంతా మీటింగ్​ హాల్​ నుంచి వెళ్లిపోయారు. ఆ సమయంలో పళనిస్వామి వర్గానికి చెందిన కొందరు తీవ్రస్థాయిలో ఓపీఎస్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన వైపు నీళ్ల సీసాలను విసిరారు. పన్నీర్​సెల్వం కారు టైర్లలో గాలి కూడా తీసేశారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య సమావేశం కేవలం 40 నిమిషాల్లోనే ముగిసింది.

ఆ సమావేశం నుంచే..: 2016లో అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత మరణానంతరం.. ఆ పార్టీ ద్వంద్వ నాయకత్వ సూత్రాన్ని అనుసరిస్తోంది. అయితే పళనిస్వామి మాత్రం పార్టీలో ఏక నాయకత్వానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. జూన్ 14న జిల్లా కార్యదర్శి సమావేశం జరిగినప్పటి నుంచి పార్టీలో ఏక నాయకత్వం కోసం చర్చ మొదలైంది. సమస్యను పరిష్కరించేందుకు ఇరువర్గాలు పలు దఫాలుగా చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. గురువారం ఈ కీలక సమావేశాన్ని జరపాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఏక నాయకత్వానికి సంబంధించిన తీర్మానానికి ఆమోదింపజేయాలని అనుకున్నారు. కానీ, తన సంతకం లేకుండా జనరల్​ బాడీ తీర్మానం ఆమోదం పొందదంటూ పన్నీర్​ సెల్వం సమావేశానికి ముందే వ్యాఖ్యలు చేశారు. అదే కాకుండా అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం వ్యవహారం కోర్టు దాకా వెళ్లింది. అయితే ఆ పిటిషన్​ను తోసిపుచ్చింది మద్రాస్ హైకోర్టు. పార్టీ జనరల్ కౌన్సిల్ భేటీ అంతర్గత విషయమని బెంచ్ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: మోదీ కోసం రూ.23కోట్లతో రోడ్లు.. ఒక్క వానతో ఫసక్.. రాష్ట్రంపై పీఎంఓ సీరియస్!

Last Updated : Jun 24, 2022, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.