ETV Bharat / bharat

కరోనా వ్యాక్సినేషన్​కు 4 రాష్ట్రాల్లో డ్రై రన్​ - corona vaccine latest news

కొద్ది రోజుల్లో కరోనా వ్యాక్సిన్​ దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో టీకా పంపిణీ సన్నద్ధతను పరిశీలించేందుకు నాలుగు రాష్ట్రాల్లో డ్రై రన్​ నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. డిసెంబర్ 28, 29న ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. కొ-విన్ యాప్​తో టీకా నిర్వహణ ఎలా ఉంటుందనే విషయాలను సమీక్షించనుంది.

Dry run for COVID-19 immunisation drive in 4 states next week
వ్యాక్సినేషన్​కు మందు నాలుగు రాష్ట్రాల్లో డ్రై రన్​
author img

By

Published : Dec 25, 2020, 3:45 PM IST

దేశంలో కరోనా టీకా అత్యవసర వినియోగానికి జనవరిలో అనమతులు లభించే అవకాలున్నాయి. టీకా అందుబాటులోకి వచ్చాక పంపీణీ ఎలా చేపట్టాలనే విషయాలను పరిశీలించేందుకు నాలుగు రాష్ట్రాల్లో డ్రై రన్​ నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈనెల 28, 29న పంజాబ్​, అసోం, ఆంధ్రప్రదేశ్​, గజరాత్​ రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్​ మాక్ డ్రిల్ నిర్వహించనుంది. కొవిడ్ టీకా నిర్వహణకు ఉపయోగించే కొ-విన్​ యాప్​ పని తీరును పరిశీలించనుంది.

కరోనా వ్యాక్సిన్​ డ్రై రన్​కు సంబంధించి ఈ నాలుగు రాష్ట్రాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం తెలిపింది. ఈ ప్రక్రియలో భాగంగా కొ-విన్​ యాప్​ ద్వారా టీకా తీసుకునే వారి వివరాలు పొందుపరచడం, వారికి వ్యాక్సిన్ చేరవేయడం, రసీదు, టీకా మంజూరు వంటి వివరాలను నమోదు చేయడం, టీకాలు వేసేందుకు బృందాలు ఏర్పాటు చేయడం, సెషన్ల వారీగా మాక్​ డ్రిల్​ నిర్వహించడం, వీటికి సంబంధించిన నివేదికలతో సాయంత్రం సమావేశం ఏర్పాటు చేయడం వంటి విషయాలను పరిశీలిస్తామని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

వీటితో పాటు ఆయా రాష్ట్రాల్లో టీకా నిల్వలకు కోల్డ్ స్టోరేజీలు, రవాణా సదుపాయాలు, టీకా ఇచ్చే కేంద్రాల్లో రద్దీని నియంత్రించి కరోనా జాగ్రత్తలు పాటించేలా చూడటం వంటి విషయాలను కూడా కేంద్రం సమీక్షించనుంది.

ఐదు సెషన్లు..

డ్రై రన్​ నిర్వహించే రాష్ట్రాల్లో ప్రతి రెండు జిల్లాల్లో ఐదు సెషన్లు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేటు ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్​ మాక్​ డ్రిల్స్ నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా కరోనా వ్యాక్సిన్​ను పంపిణీ చేసే సమయంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలను గుర్తించవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఫలితంగా సౌకర్యాలు మరింత మెరుగుపరిచేందుకు వీలవుతుందని పేర్కొంది.

వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం మానవ వనరులను బలోపేతం చేసేందుకు వివిధ స్థాయిల్లో అధికారులకు శిక్షణ పూర్తి చేసినట్లు కేంద్రం వెల్లడించింది. వీరిలో కోల్డ్​ స్టోరీజీ నిర్వాహకులు, వైద్య అధికారులు, ఆశా కోఆర్డినేటర్లు కూడా ఉన్నట్లు పేర్కొంది. జాతీయ స్థాయిలో 2600మంది ట్రైనర్లకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొంది. రాష్ట్ర స్థాయి, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో మొత్తం 7000 మందికి శిక్షణ పూర్తి చేసినట్లు వివరించింది.

ఇదీ చూడండి: కమల్​కు షాక్​- భాజపాలోకి ఎంఎన్ఎం ప్రధాన కార్యదర్శి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.