drugs seized in Amritsar: అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 6 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.30 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గురువారం జరిగింది.
డ్రగ్స్‌ను అక్రమంగా తరలిస్తోన్న ముఠాలో మహిక్మా అనే యువతి ఉందని పోలీసులు తెలిపారు. ఆమె ఖల్సా కళాశాలలో చదువుతోందని వెల్లడించారు. భారత్ సరిహద్దులో ఉన్న గ్రామాలకు చెందిన లవ్‌ప్రీత్, దీపక్‌లను మరో ఇద్దరిని నిందితులుగా పోలీసులు గుర్తించారు. వీరి ముగ్గురికి చాలా కాలంగా పరిచయం ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితులు ముగ్గురిని కోర్టులో హాజరుపరిచగా.. మూడు రోజుల రిమాండ్ విధించిందని తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామని అన్నారు.
ఇదీ చదవండి: సొంత చెల్లెళ్లపైనే అత్యాచారం.. కన్నతల్లిని కూడా..