Drugs in delhi airport: దిల్లీ విమానాశ్రయ అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి భారత్‌కు ఓ మహిళ అక్రమంగా తరలిస్తుండగా.. వీటిని పట్టుకున్నారు. వీటి విలువ రూ.72.50 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
Heroin in airport: అదీస్ అబాబా నుంచి దుబాయ్ మీదుగా మహిళ.. భారత్‌కు చేరుకుంది. విమానాశ్రయంలో ఆమె అనుమానాస్పదంగా కనిపించగా.. టెర్మినల్ 3 వద్ద ఆమెను కస్టమ్స్ అధికారులు పరిశీలించారు. ఆమె లగేజీ నుంచి రెండు లెదర్ ఫోల్డర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అవి అధిక బరువుతో ఉండగా.. వాటిని కత్తిరించి చూడగా విస్తుపోవడం అధికారుల వంతైంది. ఆ ఫోల్డర్లో పాలీ బ్యాగులు కనిపించాయి. అందులో డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
స్క్రీనింగ్ సమయంలో నిఘా కంటికి చిక్కకుండా కార్బన్, బ్లాక్ టేప్లతో డ్రగ్స్‌ను మహిళ చుట్టిపెట్టింది. మొత్తం 6 పాలీ బ్యాగుల్లో ఉన్న డ్రగ్స్‌ను హెరాయిన్‌గా అధికారులు గుర్తించారు. సదరు మహిళను ఎన్డీపీఎస్ చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: 'మందులు వాడకుండానే ఒమిక్రాన్ బాధితుల రికవరీ!'
ఇదీ చూడండి: ట్యాబ్లెట్ల డోస్ పెంచి కన్నబిడ్డ 'హత్య'- శవాన్ని డ్రమ్ములో దాచి కిడ్నాప్ డ్రామా!