ETV Bharat / bharat

మళ్లీ డ్రగ్స్​ కలకలం.. భయంతో బాత్​రూంలో దాక్కున్న నటి!

author img

By

Published : Aug 31, 2021, 12:45 PM IST

మాదక ద్రవ్యాల వ్యవహారం(Drugs case) మళ్లీ ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఇదివరకే శాండిల్​వుడ్​కు చెందిన ప్రముఖ కథానాయికలు రాగిణి ద్వివేది, సంజనా గలాన్రీ అరెస్టు కాగా.. ఇప్పుడు ప్రముఖ మోడల్​ సహా మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సినీ రంగానికి చెందిన చాలా మందికి ఇందులో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

police raid Model and DJ house in Bengaluru, 3 detained
డ్రగ్స్​ కలకలం

కర్ణాటకలో మాదకద్రవ్యాల వ్యవహారం(Kannada Drugs case) కలకలం రేపుతోంది. బెంగళూరులో వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు జరిపిన సోదాల్లో.. నటి, మోడల్​, కాస్మోటిక్ వ్యాపారం నిర్వహించే సోనియా అగర్వాల్​, మరో వ్యాపారవేత్త భరత్​, డీజే వచన్​ చిన్నప్ప ఫ్లాట్లలో డ్రగ్స్​ బయటపడ్డాయి. ప్రస్తుతం వీరిని విచారిస్తున్నారు. వీరందరికీ నైజీరియా డ్రగ్స్​ పెడ్లర్లతో(డ్రగ్స్​ విక్రయం జరిపేవారు) సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

బాత్​రూంలో దాక్కున్న సోనియా..

రాజాజీనగర్​లోని సోనియా ఇంట్లో జరిపిన రైడ్​లో.. 40 గ్రా. గంజాయి దొరికినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో మోడల్​ ఇంట్లో లేదు. ఓ హోటల్​లో ఉందన్న సమాచారంతో అక్కడికి వెళ్లగా.. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకొనే ప్రయత్నం చేసింది సోనియా. చివరకు.. బాత్​​రూంలో దాక్కున్న ఆమెను బయటకు లాక్కొచ్చారు.

ఒప్పుకున్న సోనియా..

డీజే హళ్లి పోలీసుల విచారణలో నైజీరియా డ్రగ్స్​ వ్యాపారి థామస్​తో తనకు పరిచయం ఉందని ఒప్పుకొంది సోనియా. హై-ఫై పార్టీలకు డ్రగ్స్​ సరఫరా చేసినట్లు అంగీకరించింది. చాలా మంది రాజకీయ నాయకులు, స్టార్​ నటీనటుల పిల్లలు, కథానాయికలతోనూ తనకు పరిచయాలున్నాయని చెప్పింది.

లిస్ట్​ పెద్దదే..

వ్యాపారవేత్త భరత్​ తన ఫ్లాట్​లో.. డ్రగ్​ పార్టీలు నిర్వహిస్తుంటాడని ఆరోపణలున్నాయి. సినీ రంగానికి చెందిన ప్రముఖులు చాలా మందే అక్కడికి వెళ్తుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ కోణంలోనూ అనుమానితులను ప్రశ్నిస్తున్నారు పోలీసులు.

డీజే వచన్​ బంధువుల ఇళ్లలోనూ గంజాయి దొరికింది. వీరిరువురికీ.. సినీ పెద్దలు తెలుసని, సినిమా ఇండస్ట్రీలో చాలా మందికే డ్రగ్స్​ సరఫరా చేస్తున్నారని సమాచారం అందినట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరిని కేజీ హళ్లి, గోవిందాపుర ప్రాంతాల్లో ప్రశ్నిస్తున్నారు.

DRUGS CASE
డీజే వచన్​ చిన్నప్ప

ఆ సోనియా కాదు!

నటి, మోడల్​ సోనియా అగర్వాల్​ ఇంట్లో గంజాయి దొరికింది అనగానే చాలా మంది.. 7/G బృందావన కాలనీ ఫేమ్​, ప్రముఖ డైరెక్టర్​ సెల్వ రాఘవన్​ సతీమణి సోనియా అగర్వాల్​ అనుకున్నారు. పలు మీడియాల్లో ఇలా వార్తలు కూడా వచ్చాయి. అయితే.. వాటిని తిప్పికొట్టిందా నటి. డ్రగ్స్​ కేసుతో తనకేం సంబంధం లేదని, ఆ ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ట్విట్టర్​లో ఓ ఆడియో విడుదల చేసింది.

  • Here my 2 cents for the media and for the journalist’s who doesnt bother to do their home work properly and is very eager to print and defame a person without any investigation…,whilst I am in Kerala shooting for my new project. https://t.co/RNbYZmJTVr

    — Sonia aggarwal (@soniya_agg) August 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చూడండి: 'కారాగారంలో గాయపడ్డా.. చికిత్సకు అనుమతివ్వండి'

DRUGS CASE : డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. విచారణకు హాజరైన పూరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.