ETV Bharat / bharat

50 రూపాయల గొడవ- ఏడాదిన్నర చిన్నారి బలి - Drug addict kills child haryana

రూ.50 తగాదా కారణంగా ముక్కుపచ్చలారని చంటి బిడ్డను బలితీసుకున్నాడు ఓ కిరాతకుడు. దాదాపు 6నెలలు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగిన నిందితుడు.. ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. ఈ ఘటన హరియాణాలో జరిగింది.

Drug addict kills child
మత్తుకు బానిస
author img

By

Published : Aug 17, 2021, 10:15 AM IST

మత్తుకు బానిసైన ఓ యువకుడు.. 50 రూపాయల పంచాయతీ కారణంగా.. ఇంటికి ఎదురుగా ఆడుకుంటున్న 18నెలల చిన్నారిని చంపాడు. ఎట్టకేలకు ఆరు నెలల తర్వాత పోలీసులకు చిక్కాడు.

ఏం జరిగిందంటే..

హరియాణా ఫరీదాబాద్​లోని ఖేరా కలాన్, సెక్టార్-56లో నరేశ్ అలియాస్ బిన్ను(22) నివాసం ఉంటున్నాడు. అతడి ఇంటి పక్కనే షా మహమ్మద్​ కుటుంబం నివసిస్తోంది. అయితే ఘటన జరగక రెండురోజుల ముందు.. షా మహమ్మద్ కుమార్తె(8) వద్ద నుంచి రూ. 50 కాజేశాడు బిన్ను. ఈ ఇదే విషయంపై షా, బిన్ను వాగ్వాదానికి దిగారు. దీంతో షా కుటుంబంపై బిన్ను కక్ష పెంచుకున్నాడు.

కక్షతో..

ఈ క్రమంలో ఫిబ్రవరి 6న సాయంత్రం.. షా కుమారుడు ఆడుకుంటుండగా.. బిన్ను వచ్చి ఎత్తుకెళ్లాడు. మేడమీదకు తీసుకెళ్లి బాలుడిని నీటి ట్యాంకర్​లో వేసి చంపాడు. మెల్లగా అక్కడి నుంచి పరారయ్యాడు. దాదాపు ఆరు నెలలపాటు వివిధ ప్రాంతాల్లో దాక్కున్న బిన్ను.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. బిన్నును అరెస్ట్ చేసిన పోలీసులు.. కోర్టులో హాజరుపరచనున్నారు.

ఇదీ చదవండి: తల్లీకుమారులపైకి దూసుకెళ్లిన బస్సు- తెగిపడ్డ కాళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.