రాయ్‌పుర్, ఇందోర్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్ఐ) బృందాలు సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. రూ. 42 కోట్లు విలువ చేసే బంగారం-వెండి బిస్కెట్లను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
తొలుత రాయ్‌పుర్‌లో ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ బృందాలు.. రాజనందగావ్లోని మోహిని జ్యువెల్లర్స్లోను సోదాలు చేశాయి. రాయ్‌పుర్‌లో 13కేజీల బంగారం స్వాధీనం చేసుకొని, మోహిని జ్యువెల్లర్స్ నుంచి 4,545 కేజీల వెండి, నాలుగున్నర కేజీల బంగారం, రూ. 32లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాయి. ఈ ఘటనకు సంబంధించి మరో ముగ్గురిని ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నాయి.
రాయ్‌పుర్‌కు చెందిన ఇద్దరు స్మగ్లర్లు 13 కేజీల బంగారాన్ని కోల్‌కతా నుంచి అక్రమంగా తీసుకువచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:మంత్రే అంబులెన్సు డ్రైవర్‌గా మారి..