ETV Bharat / bharat

వాయుసేన కోసం డీఆర్​డీఓ 'నిఘా నేత్రాలు' - డీఆర్​డీఓ వాయుసేన

గగనతలంలో నిఘాను పెంచే అధునాతన ఎయిర్​క్రాఫ్ట్​లను తయారు చేసేందుకు డీఆర్​డీఓ ప్రణాళికలు రచించింది. రూ. 10,500 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. శత్రుదేశాల భూభాగాలపై 360 డిగ్రీల కోణంలో నిఘా ఉంచే విధంగా భద్రతా దళాలకు ఈ విమానాలు ఉపయోగపడనున్నాయి.

DRDO to built six new 'eyes in the sky' for IAF
వాయుసేన కోసం డీఆర్​డీఓ 'నిఘా నేత్రాల' తయారీ
author img

By

Published : Dec 17, 2020, 5:44 AM IST

దేశీయ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా డీఆర్​డీఓ కీలక ముందడుగు వేయనుంది. గగనతలంలో నిఘాను పెంచే 'వాయుమార్గ ముందస్తు హెచ్చరిక, నియంత్రణ విమానాల(ఏఈడబ్ల్యూసీ)'ను తయారు చేయనుంది. ఇవి అందుబాటులోకి వస్తే చైనా, పాకిస్థాన్ సరిహద్దులో భారత వాయుసేన నిఘా సామర్థ్యాలు మరింత మెరుగుపడతాయి.

రూ. 10,500 కోట్ల భారీ ప్రాజెక్టు కింద ఏఈడబ్ల్యూసీ బ్లాక్ 2 ఎయిర్​క్రాఫ్ట్​లను డీఆర్​డీఓ అభివృద్ధి చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆరు విమానాలను ఎయిరిండియా నుంచి సేకరించి.. రాడార్​తో ప్రయాణించేలా మార్పులు చేయనున్నట్లు వెల్లడించాయి. 360 డిగ్రీల కోణంలో నిఘా ఉంచే విధంగా భద్రతా దళాలకు ఈ విమానాలు ఉపయోగపడతాయని స్పష్టం చేశాయి.

త్వరలో ఆమోదం

ఇప్పుడున్న నెట్రా(నెట్​వర్క్ ట్రాఫిక్ అనాలసిస్) వ్యవస్థతో పోలిస్తే ఏఈడబ్ల్యూసీ సామర్థ్యం మెరుగ్గా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. శత్రుదేశాల భూభాగాలపై 360 డిగ్రీల కోణంతో నిఘా వేసే అవకాశం దీని ద్వారా లభించనుందని వెల్లడించాయి. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం త్వరలోనే ఆమోదించే అవకాశం ఉన్నట్లు చెప్పాయి.

ఎయిరిండియా నుంచే విమానాలను తీసుకుంటున్న నేపథ్యంలో యూరోపియన్ సంస్థ నుంచి ఎయిర్​బస్ 330 ట్రాన్స్​పోర్ట్ ఎయిర్​క్రాఫ్ట్​లను కొనుగోలు చేయాలన్న నిర్ణయాన్ని విరమించినట్లు తెలిపారు అధికారులు. యూరోపియన్ సంస్థ నుంచి విమానాలను కొనుగోలు చేసి బెంగళూరులో అభివృద్ధి చేయాలని తొలుత భావించినట్లు చెప్పారు. అయితే తాజా ప్రణాళిక.. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్​ను ప్రోత్సహించేలా రూపొందించినట్లు స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.