ETV Bharat / bharat

2డీజీ డ్రగ్ వాడాలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! - డీఆర్​డీఓ 2డీజీ డ్రగ్​

2డీజీ ఔషధాన్ని ఇష్టారీతిలో వినియోగించకూడదని డీఆర్​డీఓ స్పష్టం చేసింది. వైద్యుల పర్యవేక్షణలోనే దీనిని తీసుకోవాలని కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది.

2DG DRDO guidelines
2డీజీ డ్రగ్​ డీఆర్​డీఓ మార్గదర్శకాలు
author img

By

Published : Jun 1, 2021, 2:56 PM IST

2డీజీ ఔషధ (2dg medicine) వినియోగంపై కీలక మార్గదర్శకాలను(DRDO 2dg drug guidelines) విడుదల చేసింది డీఆర్‌డీఓ. కొవిడ్​ చికిత్సలో 2డీజీ ఔషధాన్ని ఇష్టారీతిగా వినియోగించకూడదని స్పష్టం చేసింది. వైద్యుల పర్యవేక్షణలోనే ఔషధాన్ని తీసుకోవాలని పేర్కొంది.

మార్గదర్శకాలు ఇలా...

  • మోస్తరు నుంచి తీవ్ర ల‌క్షణాలు ఉన్నవారు వాడొచ్చు
  • ప్రస్తుతమున్న చికిత్సకు అనుబంధంగానే 2డీజీ వాడాలి
  • వైద్యులు గరిష్ఠంగా 10 రోజులలోపు 2డీజీని సూచించాలి
  • గ‌ర్భిణీలు, బాలింత‌లు, 18ఏళ్లలోపు వారికి 2డీజీ వాడొద్దు
  • మధుమేహం, తీవ్ర గుండె జ‌బ్బులు ఉన్నవారిపై 2డీజీని పరీక్షించలేదు
  • కొన్ని జబ్బులున్న వారికి 2డీజీ ఇచ్చేముందు జాగ్రత్త అవ‌స‌రం
  • 2డీజీ ఔషధం కోసం 2DG@drreddys.comకు మెయిల్ చేయాలి
  • కరోనా బాధితులు లేదా కుటుంబ సభ్యులు మెయిల్‌ చేయాలి
  • చికిత్స పొందుతున్న ఆసుపత్రి ద్వారా ఔషధం పొందుతారు

కరోనాపై పోరులో భాగంగా.. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌తో కలిసి ఈ ఔషధాన్ని డీఆర్‌డీఓ అభివృద్ధి చేసింది. నీటిలో కలుపుకొని తాగేలా పౌడర్‌ రూపంలో 2-డీజీ ఔషధం తయారు చేశారు.

ఇదీ చూడండి:- 'ఆపద వేళ.. ఆశాకిరణంలా 2-డీజీ డ్రగ్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.