ETV Bharat / bharat

సైనికుల కోసం తేలికపాటి బుల్లెట్​ ప్రూఫ్​ జాకెట్! - bullet proof jacket news updates

భారత సైనికుల కోసం తేలికపాటి బుల్లెట్​ ప్రూఫ్​ జాకెట్​(బీపీజే)ను డీఆర్​డీఓ అభివృద్ధి చేసింది. దీనిని బ్యూరో ఆఫ్​ ఇండియన్​ స్టాండర్డ్​(బీఐఎస్​) ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసినట్లు అధికారులు తెలిపారు.

DRDO develops light weight bullet-proof jacket
సైనికులకు తేలికపాటి బుల్లెట్​ ప్రూఫ్​ జాకెట్!
author img

By

Published : Apr 1, 2021, 7:45 PM IST

దేశ సైనికుల అవసరాలకు తగిన విధంగా తేలికపాటి బుల్లెట్​ ప్రూఫ్ జాకెట్​(బీపీజే)ను తయారు చేసింది రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్​డీఓ). ఈ విషయాన్ని డీఆర్​డీఓ అధికారులు మంగళవారం తెలిపారు. ​

డీఆర్​డీఓకు చెందిన రక్షణ వస్తు నిల్వల పరిశోధన అభివృద్ధి విభాగం(డీఎంఎస్​ఆర్​డీఈ) తయారు చేసిన ఈ తొమ్మిది కిలోల ఫ్రంట్​ హార్డ్​ ఆర్మోర్​ ప్యానెల్​(ఎఫ్​హెచ్​ఏపీ) జాకెట్​ను చండీగఢ్​లోని​ టెర్మినల్​ బాలిస్టిక్స్​ రీసెర్చ్​ లేబొరేటరీ(టీబీఆర్​ఎల్​)లో విజయవంతంగా పరీక్షించారు. దీనిని బ్యూరో ఆఫ్​ ఇండియన్​ స్టాండర్డ్​(బీఐఎస్​) ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసినట్లు అధికారులు తెలిపారు.

సైనికుల సౌలభ్యం దృష్ట్యా బీపీజేను తయారు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రత్యేకమైన వస్తువులు, సాంకేతిక పరిజ్ఞానంతో బీపీజేను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. తద్వారా జాకెట్ బరువును 10.4 కిలోల నుంచి 9 కిలోలకు తగ్గించినట్లు తెలిపారు.

తేలికపాటి బీపిజేను అభివృద్ధి చేసిన డీఆర్​డీఓ శాస్త్రవేత్తలకు రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్ అభినందనలు తెలిపారు​.

ఇదీ చూడండి: ఎకే-47 బుల్లెట్లను తట్టుకునే హెల్మెట్​ను చూశారా..!​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.