ETV Bharat / bharat

DRDOలో చేరతారా? బీకాం, బీఎస్సీ డిగ్రీ ఉందా?.. మీకోసమే ఈ నోటిఫికేషన్! - drdo job application process

డీఆర్​డీఓ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి శుభవార్త. వివిధ విభాగాల్లో 150 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది డీఆర్​డీఓ. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఎంపిక విధానం వంటి సమాచారం మీకోసం.

drdo apprentice job recruitment 2023 and application details
డీఆర్​డీవో 150అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.
author img

By

Published : Mar 11, 2023, 11:53 AM IST

డీఆర్​డీఓలో పని చేయాలనుకునే వారికి శుభవార్త. 150 పోస్టులకు గానూ డీఆర్​డీఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్రెంటిస్ ట్రైనీల కోసం దరఖాస్తులు కోరింది. అర్హులైన, ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఫిబ్రవరి 24 నుంచి ఆన్​లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ ఆర్గనైజేషన్ బెంగళూరు అప్రెంటిస్ ట్రైనీల కోసం ఆన్​లైన్​లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు గ్రాడుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్), డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీస్, ఐటీఐ అప్రెంటిస్ ట్రైనీస్ ఇలా వివిధ విభాగాలలో ఉన్న ఖాళీలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పై విభాగాలలో 150 పోస్టులకు గానూ దరఖాస్తులను కోరుతోంది. డీఆర్​డీఓ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాల నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ప్రతినెల రూ.9000 స్టైఫండ్​గా పొందుతారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులు బెంగళూరులో పని చేయాల్సి ఉంటుంది.

డీఆర్​డీఓ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు వారి అకడమిక్ మెరిట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపికవుతారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను డీఆర్​డీఓ అధికారిక వెబ్​సైట్​లో పొందుపరుచుతారు. ఉద్యోగ అప్​డేట్లకోసం అభ్యర్థులు ప్రతిరోజు వెబ్​సైట్​ను చెక్​ చేస్తుండాలి.

ఖాళీల వివరాలు

  • మొత్తం ఖాళీలు: 150
  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీలు- ఇంజినీరింగ్ (బీఈ, బీటెక్‌): 75 ఖాళీలు
  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీలు- నాన్ ఇంజినీరింగ్ (బీకాం/ బీఎస్సీ/ బీఏ/ బీసీఏ, బీబీఏ): 30 ఖాళీలు
  • డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీలు: 20 ఖాళీలు
  • ఐటీఐ అప్రెంటిస్ ట్రైనీలు: 25 ఖాళీలు

వయోపరిమితి:
18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

  • అర్హత:
  • సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
  • ఇంజినీరింగ్ అప్రెంటిస్ ట్రైనీలు(బీఈ, బీటెక్): గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి గ్రాడుయేషన్ పట్టా పొంది ఉండాలి.
  • ప్రెంటిస్ ట్రైనీలు నాన్ ఇంజినీరింగ్(బీకామ్, బీసీఏ, బీబీఏ) : గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి డిగ్రీ పట్టాను పొంది ఉండాలి.
  • అప్రెంటిస్ ట్రైనీలు ఐటీఐ : గుర్తింపు పొందిన యూనివర్సిటి/టెక్నికల్ సంస్థ నుంచి పట్టాభద్రులై ఉండాలి,

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభతేది:2023, ఫిబ్రవరి24
  • దరఖాస్తు చివరితేది: 2023, మార్చి24
  • వెబ్​సైట్​లో అభ్యర్థుల ఎంపిక వివరాలు : 2023, ఎప్రిల్11
  • ఎన్నికైన అభ్యర్థుల జాయినింగ్ :2023, ఏప్రిల్17
  • అభ్యర్థులతో ఇంటరాక్షన్: 2023, ఏప్రిల్20
  • చివరిగా అభ్యర్థుల ఎంపిక:2023, 28 ఏప్రిల్
  • చివరిగా ఎన్నికైన అభ్యర్థులు జాయిన్ అవ్వాల్సిన తేది: 2023, మే8

స్టైఫండ్

  • ఇంజినీరింగ్ అప్రెంటిస్ ట్రైనీలకు రూ.9000
  • డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీలకు రూ.8000
  • ఐటీఐ అప్రెంటిస్ ట్రైనీలకు రూ.7000
  • నాన్ ఇంజినీరింగ్ ట్రైనీలకు రూ.9000

ఎంపిక ప్రక్రియ

  • అకడమిక్ మెరిట్
  • రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం
ఆసక్తిగల, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్​సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.