doctor commits suicide in Hyderabad : హైదరాబాద్ బంజారాహిల్స్‌లో మజారుద్దీన్ అనే వైద్యుడు తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని తన నివాసంలో గన్‌తో కాల్చు కోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మజారుద్దీన్ అలీ ఖాన్(60) మృతి చెందాడు.
మృతుడు మజారుద్దీన్ అలీ ఖాన్ ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి వియ్యంకుడు. అసదుద్దీన్ ఓవైసీ రెండో కూతురు అఫియా వివాహం సెప్టెంబర్22, 2020లో మృతుని కుమారుడు అబిల్ అలీ ఖాన్‌తో నిర్వహించారు. ఒవైసీ ఆస్పత్రి ఏర్పాటు చేసినప్పటి నుంచి అందులో అర్థోపెడిక్ విభాగాధిపతిగా మజారుద్దీన్ పనిచేస్తున్నారు. ఈ వివాహంతో ఒవైసీ, మజారుద్దీన్ అలీఖాన్ కుటుంబాల మధ్య మూడు దశాబ్దాలుగా ఉన్న స్నేహం.. బంధంగా మారింది.
doctor committed suicide by shooting a gun: మజారుద్దీన్ ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పలు వివరాలు తెలుసుకున్నారు. పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ తగాదాల కారణంగా మజారుద్దీన్ ఈ దారుణానికి పాల్పడినట్లుగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మజారుద్దీన్పై గతంలో గృహహింస కేసు నమోదైంది.
"మధ్యాహ్నం ఒంటి గంటకు మజారుద్దీన్ అలీ ఖాన్‌ను కుటుంబ సభ్యులు అతన్ని అపోలోకు తీసుకెళ్లారు. అప్పటికే అతను చనిపోయినట్టు ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించి మాకు సమాచారం అందించారు. మృతుడు 60 సంవత్సరాల వయసు గల డాక్టర్ మజార్ గుర్తించాం.ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నాం. మృతుడు తన లైసెన్స్డ్ వెపన్తో షూట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అతడు లైసెన్స్ ఉన్న వెపన్ తోనే షూట్ చేసుకున్నాడా లేక మరో వెపంతో షూట్ చేసుకున్నాడా అన్నది దర్యాప్తు చేస్తున్నాం. ఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తుంది. ఎన్ని రౌండ్లు షూట్ చేసుకున్నాడు అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి ఒక్క రౌండ్ మాత్రమే ఫైర్ జరిగినట్లు క్లూస్ టీం గుర్తించింది. మృతుడు కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదాలు, కుటుంబ తగాదాలు ఉన్నాయి. మృతుడిపై గృహహింస కేసు కూడా ఉంది."- జోయల్ డేవిస్ పశ్చిమ మండల డీసీపీ
ఇవీ చదవండి:
భారీ బందోబస్తు మధ్య ముగిసిన ప్రీతి అంత్యక్రియలు.. విషాదంలో గ్రామస్థులు
నవీన్ హత్య కేసు రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు