ETV Bharat / bharat

పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్ బేడీ తొలగింపు

Dr. Kiran Bedi removed as the Lieutenant Governor of Puducherry
పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్ బేడీ తొలగింపు
author img

By

Published : Feb 16, 2021, 9:26 PM IST

Updated : Feb 16, 2021, 9:50 PM IST

21:22 February 16

పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్ బేడీ తొలగింపు

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పుదుచ్చేరిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్న కిరణ్‌ బేడీని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తొలగించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

పుదుచ్చేరిలో నెలరోజుల వ్యవధిలో అధికార కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో పార్టీ బలం మెజార్టీ మార్కు దిగువకు చేరడంతో అక్కడి ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఈ క్రమంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవి నుంచి కిరణ్‌ బేడీని తొలగించి 'తమిళిసై'కి బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది.

ఇదీ చూడండి: పుదుచ్చేరి ప్రభుత్వానికి 'రాజీనామా' సెగ

Last Updated : Feb 16, 2021, 9:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.