ETV Bharat / bharat

కెప్టెన్​కు ఎమ్మెల్యేల మద్దతు- సిద్ధూకు పదవిపై నీలినీడలు! - పంజాబ్​ కాంగ్రెస్​లో సంక్షోభం

పంజాబ్​ కాంగ్రెస్​లో సంక్షోభం మళ్లీ మొదటికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. అంతా సద్దుమణిగి పీసీసీ అధ్యక్ష పదవిపై అధిష్ఠానం నిర్ణయం వెలువరించనుందన్న సమయంలో సీఎం అమరీందర్​కు మద్దతుగా 10 మంది ఎమ్మెల్యేలు ఉమ్మడి ప్రకటన చేశారు. కెప్టెన్​ వల్లే రాష్ట్రంలో పార్టీ బలమైన స్థానంలో ఉందని, ఆయనను నిరాశపరచొద్దని కోరారు.

Captain Amarinder Singh
అమరీందర్​ సింగ్​, నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ
author img

By

Published : Jul 18, 2021, 7:18 PM IST

పంజాబ్​ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ రసవత్తరంగా మారుతున్నాయి. రాష్ట్ర ఇంఛార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరీశ్​ రావత్​.. ముఖ్యమంత్రి కెప్టెన్​ అమరీందర్​ సింగ్​తో​ భేటీ అయిన తర్వాత సంక్షోభానికి తెరపడినట్లు కనిపించింది. పంజాబ్​ ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ నియామకం దాదాపుగా ఖరారైందని అనుకున్న తరుణంలో మళ్లీ ముసలం మొదలైంది. 10 మంది శాసనసభ్యులు కెప్టెన్​కు మద్దతుగా ఉమ్మడి ప్రకటన చేశారు. పార్టీ ఎమ్మెల్యేలతో పీపీసీసీ అధ్యక్షుడు సమావేశమయ్యేందుకు ఒకరోజు ముందు.. ఈ ప్రకటన చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎమ్మెల్యేల ఉమ్మడి ప్రకటన..

పంజాబ్​ కాంగ్రెస్​ పునర్​వ్యవస్థీకరణపై అధిష్ఠానం తుది ప్రకటన చేయనున్న నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలు సీఎంకు మద్దతుగా ఆదివారం ఉమ్మడి ప్రకటన చేశారు. ఆయనను నిరాశపరచొద్దని అగ్రనాయకత్వాన్ని కోరారు. ఏడుగురు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇటీవలే పార్టీలో చేరిన ఆప్​ ఎమ్మెల్యేల తరఫున పార్టీ నేత సుఖ్​పాల్​ సింగ్​ ఖైరా ఈ ప్రకటన విడుదల చేశారు.

" నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ ఒక సెలబ్రిటీ, పార్టీకి బలమని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, సొంత ప్రభుత్వంపై బహిరంగంగానే విమర్శలు చేయటం.. కార్యకర్తల్లో చీలికకు, పార్టీ బలహీన పడటానికి కారణమవుతోంది. అమరీందర్​ సింగ్​ను నిరాశపరచొద్దు. ఆయన నిరంతర కృషి వల్లే పంజాబ్​లో పార్టీ బలంగా ఉంది. పీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక అనేది హైకమాండ్​కు ఉన్న ప్రత్యేక హక్కు అనటంలో సందేహం లేదు. కానీ అదే సమయంలో గత కొద్ది నెలలుగా పార్టీ గ్రాఫ్​ను తగ్గించిన మకిలిన తొలగించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని వివిధ వర్గాల్లో సింగ్​కు అద్భుతమైన ఆదరణ ఉంది. ముఖ్యంగా రైతుల్లో. సిక్కుల్లో సింగ్​ అతిపెద్ద నేత. ఎన్నికలకు కేవలం ఆరునెలల సమయం ఉంది. పార్టీని వేరు వేరు దిశల్లోకి లాగటం అంత మంచిది కాదు. "

- ఎమ్మెల్యేల ఉమ్మడి ప్రకటన

సిద్ధూ వివాదాస్పద ట్వీట్లపై బహిరంగంగా క్షమాపణ కోరేవరకు ఆయన్ను కలవరాదన్న అమరీందర్​ నిర్ణయానికి మద్దతు ప్రకటించారు ఎమ్మెల్యేలు. సిద్ధూ క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. అప్పుడే పార్టీ, ప్రభుత్వం ఏకతాటిపై నడుస్తాయన్నారు.

పార్టీ ఎమ్మెల్యేలతో పీపీసీసీ చీఫ్​ భేటీ

రాష్ట్ర విభాగంలో మార్పుల నేపథ్యంలో పార్టీ శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులతో సోమవారం సమావేశం కానున్నారు పీపీసీసీ అధ్యక్షుడు సునీల్​ జఖర్​. ఈ భేటీలో పంజాబ్​ విషయంలో పార్టీ హైకమాండ్​ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని తీర్మానం చేయనున్నట్లు తెలిపారు. ఆ తీర్మానాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపిస్తామని చెప్పారు. రాష్ట్రం విషయంలో అధిష్ఠానం వేగంగా నిర్ణయం తీసుకోవాలని కోరనున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యేలతో సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుందని తెలిపారు.

దిల్లీలో పంజాబ్​ కాంగ్రెస్​ ఎంపీల సమావేశం

పంజాబ్​ కాంగ్రెస్​లో అంతర్గత విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీకి చెందిన 11 మంది ఎంపీలు దిల్లీలోని పర్తాప్​ సింగ్​ బజ్వా నివాసంలో సమావేశమయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. నవజ్యోత్​​ సింగ్​ సిద్ధూకు రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీ జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. పార్లమెంట్​ వర్షాకాల సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించేందుకే ఈ భేటీ జరిగినట్లు ఎంపీలు తెలిపారు. పార్టీ ఎంపీలతో సోనియా గాంధీ భేటీ కానున్నట్లు తెలిపారు.

వరుస భేటీలు..

పార్టీ పునర్​వ్యవస్థీకరణ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు సీఎం అమరీందర్​ సింగ్​, నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ. ఈ క్రమంలోనే వేరు వేరుగా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి: శాంతించిన కెప్టెన్​.. సిద్ధూకే పంజాబ్​ పగ్గాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.