ETV Bharat / bharat

మహిళ ఆత్మహత్య- అత్తవారింటికి బంధువులు నిప్పు - jammu kashmir domestic violance case

అత్తవారింటి వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న మహిళ తరఫు కుటుంబ సభ్యులు.. ఆమె భర్త ఇంటికి నిప్పంటించారు.

anantanag domestic violance news
అనంతనాగ్​లో గృహహింస
author img

By

Published : Apr 10, 2021, 4:01 PM IST

Updated : Apr 10, 2021, 10:25 PM IST

జమ్ము కశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో దారుణం జరిగింది. వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకోగా.. ఆమె కుటుంబసభ్యులు, బంధువులు.. ఆగ్రహంతో అత్తవారింటిని తగలబెట్టారు.

anantanag domestic violance news
మంటలకు కాలిపోతున్న ఇల్లు
anantanag domestic violance news
ఇంట్లో నుంచి ఎగసిపడుతున్న మంటలు

జిల్లాలోని మొమినాబాద్‌లో ఈ ఘటన జరిగింది. 30ఏళ్ల నఫీసా తన భర్త అతిఫ్‌ గుల్‌ మిస్గర్‌తో కలిసి స్థానికంగా నివాసం ఉంటోంది. భర్త కుటుంబసభ్యులు వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న నసీఫా కుటుంబసభ్యులు.. అతిఫ్‌ ఇంటికొచ్చి విధ్వంసానికి పాల్పడ్డారు. ఇంటికి నిప్పంటించారు.

anantanag domestic violance news
భారీగా పొగ

ఈ సమాచారం తెలుసుకొని ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. అయితే ఇల్లు మాత్రం పూర్తిగా కాలిపోయింది.

anantanag domestic violance news
మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
anantanag domestic violance news
మంటలు ఆర్పేసిన తర్వాత

ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: దిల్లీ సరిహద్దులో అన్నదాతల గుడిసెలు

Last Updated : Apr 10, 2021, 10:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.