ETV Bharat / bharat

ఆస్పత్రిలోని శవాన్ని పీక్కుతిన్న వీధి కుక్కలు - BRD Medical College body became food to stray dogs

యూపీలోని ఓ ఆస్పత్రిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కు తిన్నాయి. చెవులు, ముక్కుతో పాటు ముఖంలో సగ భాగాన్ని వీధి కుక్కలు తినేశాయి. గోరఖ్​పుర్​లోని బీఆర్​డీ వైద్య కళాశాలలో ఈ ఘటన జరిగింది.

Dogs bite off patient's body at government hospital in UP
ఆస్పత్రిలోని శవాన్ని పీక్కుతిన్న వీధి కుక్కలు
author img

By

Published : Mar 21, 2021, 10:59 AM IST

వైద్యాధికారుల నిర్లక్ష్యానికి అద్దంపట్టే అమానవీయ ఘటనకు సాక్షాత్కారంగా నిలిచింది ఉత్తర్​ప్రదేశ్​ గోరఖ్​పుర్​లోని బీఆర్​డీ మెడికల్ కళాశాల. మరణించిన ఓ వ్యక్తి శరీరాన్ని కుక్కలు పీక్కుతిన్న హేయమైన ఘటన ఈ ఆస్పత్రిలో జరిగింది.

మృతుడిని రాజేంద్ర నగర్​కు చెందిన సంజయ్​గా గుర్తించారు. మార్చి 16న ఆస్పత్రిలో చేరిన అతడు.. మెడికల్ వార్డులో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే... అతని మృతదేహం శనివారం ఆస్పత్రి ప్రధాన క్యాంపస్​లో అనుమానాస్పద రీతిలో పడిపోయి ఉంది. ఫ్లోర్​పై ఉన్న శవాన్ని వీధి కుక్కలు పీక్కు తిన్నాయి. మృతుడి చెవులు, ముక్కుతో పాటు సగం ముఖాన్ని తినేశాయి.

సెక్యూరిటీ గార్డులు మృతదేహాన్ని గుర్తించిన తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు సిబ్బంది. ఆస్పత్రి రెండో అంతస్తు నుంచి పడిపోవడం వల్లే సంజయ్ మరణించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఉదయం బయటకు వెళ్లి...

కడుపులో ఓ వ్యాధితో సంజయ్ ఆస్పత్రిలో చేరాడని అతని తల్లి యశోదా దేవి తెలిపారు. శనివారం ఉదయం 4 గంటలకు లేచి.. ఉపశమనం కోసం వార్డు బయటకు వెళ్లాడని చెప్పారు. ఎంతసేపటికీ లోపలికి రాలేదని.. తీరా వెతికేసరికి కింద ఫ్లోర్​పై పడి ఉన్నాడని వివరించారు. అక్కడ ఉన్న వీధి కుక్కలను తరిమేసి.. పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: బలగాల కాల్పుల్లో పశువుల అక్రమ రవాణాదారు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.