ETV Bharat / bharat

100 ఏళ్లుగా శునకానికి పూజలు- ఆ విగ్రహానికి మొక్కితే కోరికలు తీరుతాయట!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 5, 2023, 12:36 PM IST

Updated : Dec 5, 2023, 12:45 PM IST

Dog temple in Uttar Pradesh : సాధారణంగా ఎక్కడైనా దేవుడిని పూజిస్తారు. కానీ ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ గుడిలో శునకం విగ్రహాన్ని పూజిస్తున్నారు. అలానే ఏటా రెండు సార్లు ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్నారు. గుడిలో శునకాన్ని పూజించడానికి ఓ కారణం కూడా ఉంది. అదేంటంటే..

Dog temple in Uttar Pradesh
Dog temple in Uttar Pradesh

Dog temple in Uttar Pradesh : ఓ గుడిలో శునకం విగ్రహానికి గత వందేళ్లుగా పూజలు చేస్తున్నారు. అలానే హోలీ, దీపావళీ పండుగలకు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శునకం విగ్రహాం పాదాలకు నల్ల దారం కట్టి ఏమైనా కోరుకుంటే అవి నెరవేరుతాయని ప్రజలు నమ్ముతున్నారు. అదే ఉత్తర్​ప్రదేశ్​లోని బైరో దేవాలయం.

Dog temple in Uttar Pradesh
బాబా లటూరియా సమాధి పక్కనే బైరో విగ్రహాం

ఇదీ కథ
సుమారు 100 సంవత్సరాల క్రితం బులంద్​శహర్​లోని సికంద్రాబాద్​లో బాబా లటూరియా అనే గురువు ఉండేవారు. ఆయన ఆ ప్రాంతంలోనే ఒక దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో ఉంటూనే తనతో పాటు ఒక పెంపుడు కుక్కను పెంచుకున్నారు. దానిని బైరో బాబాగా పిలిచేవారు. అయితే ఓ రోజు బాబా లటూరియా నిర్మించుకున్న గుడిలోనే సజీవ సమాధి అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బైరో కూడా ఈ సమాధిలోకి దూకింది. అక్కడ ఉన్న ప్రజలు బైరోను బయటకు తీశారు. కానీ కొద్ది సేపటికే అది మరణించింది. ఆ తర్వాత ఆ శునకానికి గుర్తుగా ఓ విగ్రహాన్ని నిర్మించి పూజిస్తున్నారు. అప్పటి నుంచి ప్రేమ విధేయత గుర్తుగా బాబా కంటే ముందే బైరో విగ్రహానికి పూజలు చేస్తున్నారు భక్తులు.

Dog temple in Uttar Pradesh
బాబా లటూరియా సమాధి
Dog temple in Uttar Pradesh
గుడిలో పూజలు చేస్తున్న ఆలయ పూజారి

అలానే హోలీ, దీపావళి పండుగలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటామని స్థానికులు తెలిపారు. మంగళవారం, శనివారాల్లో బైరోను దర్శించుకునేందుకు ఎక్కువ మంది భక్తులు వస్తుంటారని చెప్పారు. ఈ గుడికి ఉత్తర్​ప్రదేశ్​ నుంచే కాకుండా దిల్లీ, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారని గ్రామ ప్రజలు అన్నారు.

Dog temple in Uttar Pradesh
బులంద్​శహర్ దేవాలయం

కుక్కలకు గుడి.. రోజూ ప్రత్యేక పూజలు.. గ్రామదేవతే ఆదేశించిందట!
Dog Temple Karnataka : ఎక్కడైనా దేవుడికి గుడి కట్టడం, పూజలు చేయడం సర్వసాధారణం. కానీ కర్ణాటక.. రామనగర జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం కుక్కలకు ఆలయం నిర్మించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గ్రామ దేవత కన్నా ముందు కుక్కలకే తొలి పూజ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ గ్రామస్థులంతా వచ్చి కుక్కలను దర్శించుకుంటున్నారు. ఈ అరుదైన ఆలయం నిర్మించడానికి ఓ కారణం కూడా ఉంది. తెలుసుకోవాలంటే ఈ లింక్​ క్లిక్​ చేయండి.

'రాజా'పై ప్రేమతో శునకాలయం నిర్మాణం

పెంపుడు కుక్కకు గుడి.. ప్రతి శుక్రవారం పూజలు

Last Updated : Dec 5, 2023, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.