ETV Bharat / bharat

'కుక్క కరిస్తే రూ.20వేలు పరిహారం'- రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిందేనని హైకోర్టు ఆదేశం

Dog Bite Compensation : వీధి కుక్కలు, ఇతర జంతువుల దాడి కేసులో బాధితులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని పంజాబ్​-హరియాణా హైకోర్టు స్పష్టం చేసింది. కుక్కకాటుకు గురైన వ్యక్తికి ఒక్కో పంటి గాటుకు కనీసం రూ.10వేలు చెల్లించాలని, తీవ్ర గాయమైతే రూ.20 వేల పరిహారం అందించాలని పంజాబ్‌, హరియాణాతోపాటు చండీగఢ్‌ పాలనా విభాగాలను ఆదేశించింది.

Dog Bite Compensation
Dog Bite Compensation
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2023, 7:25 PM IST

Dog Bite Compensation : దేశవ్యాప్తంగా కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో శునకం దాడికి సంబంధించిన కేసులో పంజాబ్‌-హరియాణా హైకోర్టు ఆసక్తికర తీర్పు వెలువరించింది. వీధి శునకాలు, ఇతర జంతువుల దాడి కేసులో పరిహారం చెల్లించాల్సిన ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. కుక్కకాటుకు గురైన వ్యక్తికి ఒక్కో పంటి గాటుకు కనీసం రూ.10వేలు చెల్లించాలని, తీవ్ర గాయమైతే (0.2 సెం.మీ మేర కోతపడినట్లయితే) రూ.20వేల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

వీధుల్లో ఉండే మూగజీవాల దాడులకు సంబంధించి దాఖలైన 193 పిటిషన్లను పంజాబ్‌-హరియాణా హైకోర్టు విచారించి, తీర్పు ఇచ్చింది. 'కుక్కల దాడులకు సంబంధించి బాధితులకు పరిహారం చెల్లించే ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. వీటిని సంబంధిత ప్రభుత్వ విభాగం లేదా ప్రైవేటు వ్యక్తుల నుంచి రికవరీ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంది' అని పంజాబ్‌-హరియాణా హైకోర్టు ధర్మాసనం తీర్పులో పేర్కొంది. ఆవులు, ఎద్దులు, గాడిదలు, శునకాలు, గేదెలతోపాటు అడవి, పెంపుడు జంతువుల దాడుల్లో చెల్లించాల్సిన పరిహారాన్ని నిర్ణయించేందుకు ఓ కమిటీని నియమించాలని పంజాబ్‌, హరియాణాతోపాటు చండీగఢ్‌ పాలనా విభాగాలకు సూచించింది. క్లెయిమ్‌ దాఖలు చేసిన నాలుగు నెలల వ్యవధిలో పరిహారాన్ని ఆమోదించాలని తెలిపింది.

రోడ్లపై విచ్చలవిడిగా సంచరించే పశువులు, ఇతర జంతువుల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు పరిహారం చెల్లించడానికి కూడా ఒక కమిటీని వేయాలని పంజాబ్‌-హరియాణా హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు పంజాబ్‌, హరియాణాతోపాటు చండీగఢ్‌ పాలనా విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీలో సంబంధిత జిల్లా డిప్యూటీ కమిషనర్​, డీఎస్​పీ, ఎస్​డీఎం, డీటీఓ, చీఫ్​ మెడికల్ ఆఫీసర్​ తదితరులు ఉంటారు.

మరణించిన యజమాని కోసం శునకం ఎదురుచూపులు..
కొన్నాళ్ల క్రితం యజమాని మృతి చెందాడని తెలియని ఓ శునకం.. మార్చురీ ఎదుట అతడి కోసం నిరీక్షించింది. ఈ ఘటన కేరళలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. గత కొద్ది నెలలుగా యజమాని వస్తాడనే ఆశతో ఆస్పత్రి పరిసరాల్లోనే తిరుగుతోంది. 4 నెలల క్రితం ఓ వ్యక్తి అస్వస్థతకు గురై కన్నూర్​ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. అతడి పాటు పెంపుడు కుక్క కూడా వచ్చింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

దేవుడి ప్రసాదాలు లూటీ- అలా చేస్తే సమస్త రోగాలు మాయం! 350 ఏళ్లుగా ఇదే ఆచారం

రిక్షావాలా టు క్యాబ్ కంపెనీ ఓనర్​- ఇంటర్​ చదివి ఐఐటీయన్లకు ఉద్యోగాలు- ఈయన సక్సెస్​ స్టోరీ అదుర్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.