ETV Bharat / bharat

నెలల శిశువుకు అరుదైన శస్త్రచికిత్స!

అరుదైన సమస్యతో బాధపడుతున్న శిశువుకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు ముంబయి వైద్యులు. వారం రోజుల పర్యవేక్షణ అనంతరం పసిబిడ్డను డిశ్చార్జి చేశారు.

fetus surgery baby mumbai, శిశువు కడుపులో పిండం
నెలల శిశువుకు అరుదైన శస్త్రచికిత్స!
author img

By

Published : Aug 4, 2021, 5:34 PM IST

నెల రోజుల శిశువుకు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి ఆ పసి ప్రాణాన్ని కాపాడారు ముంబయి వైద్యులు. శిశువు శరీరంలో ఉన్న మృత పిండాన్ని తొలగించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

గర్భంలో శిశువు వృద్ధి చెందుతున్న దశలోనే ఈ సమస్యను వైద్యులు గుర్తించారు. శిశువు జన్మించాక శస్త్రచికిత్సతో ఈ పిండాన్ని తొలగించేందుకు నిశ్చయించారు. బిడ్డ పుట్టి నెల రోజులు పూర్తి కాగానే ఆపరేషన్​కు సిద్ధమయ్యారు. జులై మొదటి వారంలో హాజీఅలీలోని నారాయణ్​ హెల్త్​ కేర్​ ఆసుపత్రిలో పసికందుకు విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. వారం రోజుల పర్యవేక్షణ అనంతరం చిన్నారిని వైద్యులు డిశ్చార్జి చేశారు.

శిశువుకు విజయవంతంగా ఆపరేషన్​ జరగడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు.

ఏడాదిన్నర చిన్నారిలోనూ..

మధ్యప్రదేశ్​లోని నిముచ్​ జిల్లాకు చెందిన వేదిక అనే ఏడాదిన్నర చిన్నారికి కూడా ఇటువంటి సమస్యే ఏర్పడింది. ఏడాదిన్నర వయసుగల ఆ చిన్నారికి మూడు నెలల క్రితం కడుపులో సమస్య మొదలైంది. పరీక్షలు నిర్వహించిన స్థానిక వైద్యులు.. ఆమె శరీరంలో 400 గ్రాముల పిండం ఉందని గుర్తించారు. అయితే ఆమెకు శస్త్రచికిత్స చేసేందుకు నిరాకరించారు. ఈ ఆపరేషన్ చేయడం చాలా కష్టమని, తేడా వస్తే చిన్నారి ప్రాణానికే ప్రమాదమని హెచ్చరించారు. దీంతో నిరాశ చెందిన తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల వైద్యులను సంప్రదించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో గుజరాత్​లోని అహ్మదాబాద్​ సివిల్​ ఆసుపత్రిలో ఈ సమస్యను నయం చేయగల వైద్యులు ఉన్నారని తెలుసుకున్న హర్షిత్​భాయ్​.. ట్విట్టర్​ ద్వారా వారిని సంప్రదించాడు.

ఇందుకు సానుకూలంగా స్పందించిన వైద్యులు.. చిన్నారికి శస్త్రచికిత్స చేస్తామని హామీ ఇచ్చారు. డాక్టర్​ రాకేశ్​ జోషి ఆధ్వర్యంలో చిన్నారికి ఆపరేషన్​ చేశారు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి పిండాన్ని తొలగించారు. ఈ శస్త్రచికిత్స చాలా సంక్లిష్టమైనదని.. అప్రమత్తంగా లేకపోతే కిడ్నీల నుంచి అధిక రక్తశ్రావం జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. అదే జరిగితే చిన్నారి ప్రాణానికే ప్రమాదమని తెలిపారు.

చాలా అరుదు..

'ఫీటస్​ ఇన్​ ఫీటు'గా పిలిచే ఈ సమస్య.. గర్భాశయంలో కవలలు వృద్ధి చెందుతున్న దశలో ఏర్పడే వైకల్యం వల్ల కలుగుతుందని వైద్యులు వెల్లడించారు. ఇలాంటి సమస్యలు చాలా అరుదు అని పేర్కొన్నారు. ప్రపంచంలో ప్రతి ఐదు లక్షల మంది చిన్నారుల్లో ఒకరికి ఈ సమస్య వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు పేర్కొన్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు శస్త్రచికిత్స చేసి ఆ పిండాన్ని తొలగించకపోతే భవిష్యత్తులో అది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.

ఇదీ చదవండి : స్మార్ట్​ఫోన్​ సాయంతో ఇంటి వద్దే ఈసీజీ పరీక్ష!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.