ETV Bharat / bharat

Doctors Forget Scissors in Stomach: ఏలూరు బోధనాసుపత్రిలో వైద్యుల నిర్వాకం.. సిజేరియన్‌ చేసి పొట్టలో కత్తెర మరిచారు

Doctors Forget Scissors in Stomach: వైద్యుల నిర్వాకం ఓ మహిళ ప్రాణాల మీదికొచ్చింది. ఏలూరు జిల్లాలోని బోధనాసుపత్రిలో శస్త్ర చికిత్సకు ఉపయోగించే ఫోర్‌సెప్‌(కత్తెర)ను మహిళ పొట్టలో ఉంచి కుట్లు వేశారు. ప్రస్తుతం ఆ మహిళ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

Doctors_Forgot_Scissor_in_Stomach
Doctors_Forgot_Scissor_in_Stomach
author img

By

Published : Aug 16, 2023, 6:06 PM IST

Scissors in Stomach at Eluru: ఏలూరులో వైద్యుల నిర్వాకం ఓ మహిళ ప్రాణాల మీదికొచ్చింది. జిల్లాలోని బోధనాసుపత్రిలో శస్త్ర చికిత్సకు ఉపయోగించే ఫోర్‌సెప్‌(కత్తెర)ను మహిళ పొట్టలో ఉంచి కుట్లు వేశారు. వివరాల్లోకి వెళ్తే.. పెదపాడు మండలం ఎస్ కొత్తపల్లి గ్రామానికి చెందిన జి స్వప్న అనే మహిళ డెలివరీ కోసం ఏప్రిల్​ 19వ తేదీన ఏలూరులోని బోధనాసుపత్రిలో చేరింది. ఆమెకు ఆపరేషన్​ చేసి బిడ్డను బయటకు తీశారు. ఆ తరువాత స్వప్న డిశ్చార్జి అయ్యి ఇంటికి వెళ్లిపోయింది. ఆ సమయంలో ఆపరేషన్​ చేసిన వైద్యులు ఆమె కడుపులో ఒక సర్జికల్​ ఫోర్‌సెప్‌ను ఉంచి కుట్లు వేశారు. అప్పటి నుంచి తరచూ ఆమెకు కడుపులో నొప్పి వచ్చేది. సాధారణంగా వచ్చే నొప్పే కాదా అనుకుని మందులు వాడేది.

వైద్యుల నిర్వాకం.. ఇనుప నట్టును తలపై ఉంచి కుట్లు.. ఆగని రక్తస్రావం.. చివరకు..

Refer to Vijayawada Hospital: స్వప్నకు ఈ నెల 8న కడుపు నొప్పి విపరీతంగా రావడంతో మరలా అదే ఏలూరులోని ఆసుపత్రిలో చేరింది. అక్కడి వైద్యులు పరీక్షించి ఆమెను విజయవాడ ఆసుపత్రికి సిఫార్సు చేశారు. అక్కడకు వెళ్లాక ఏలూరు బోధనాసుపత్రి వైద్యుల నిర్వాకం బయట పడింది. విజయవాడ ఆసుపత్రి డాక్టర్లు ఆమె పరిస్థితిని గమనించి ఎక్స్​రే తీయగా ఆమె కడుపులో ఫోర్‌సెప్‌ ఉన్నట్లు తెలిసింది. ఏలూరు బోధనాసుపత్రిలోని డాక్టర్లు ఆపరేషన్​ చేసి బిడ్డను బయటికి తీసి.. ఆ ఆపరేషన్‌కు ఉపయోగించిన ఫోర్‌సెప్‌ను కడుపులోనే ఉంచేసి కుట్లు వేశారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శశిధర్‌ను వివరణ కోరగా జరిగిన ఈ విషయం నిజమేనని తెలిపారు. ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటనపై ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్‌ స్పందించి విచారణ కమిటీ వేశారు.

ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్వాకం.. సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లతో చికిత్స

Doctors Response to Eluru Pregnant Lady Incident: ఈ నెల 10వ తేదీన ఏలూరు నుంచి స్వప్నను అనే మహిళను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకుని వచ్చారని వైద్యులు తెలిపారు. సర్జికల్​ ఫోర్‌ సెప్‌ను కడుపులో వదిలేసారని.. ఆ వదిలేసిన ఫోర్‌సెప్‌ దాదాపు రెండు ఇంచుల వరకు ఉంటుందని అన్నారు. ఆ వదిలేసిన ఫోర్‌ సెప్‌ కడుపులోని పేగుకి అతుక్కుని పేగు బాగా కుళ్లిపోయిందని వైద్యులు నిర్ధారించారు. విజయవాడ ఆస్పత్రికి వచ్చేసరికి రోగి పరిస్థితి బాగా ఆందోళనకరంగా ఉందని తెలిపారు.

ఆత్మకూరు ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం.. ప్రాణాలు కోల్పోయిన లెక్చరర్​

కుళ్లిపోయిన పేగుని ఆపరేషన్​ చేసి తీశామని.. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం స్వప్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రభాకర్, సర్జరీ విభాగాధిపతి అప్పారావులు తెలిపారు. వైద్యుల నిర్వాకం ఏంతోమంది రోగుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఇలా జరగడం ఇదేం మొదటి సారి కాదు.. ఇలాంటి ఘటనలు ఎన్నో అనేక సార్లు అనేక ప్రాంతాల్లో తరచూ జరుగుతూనే ఉన్నాయి.

ఏలూరు బోధనాసుపత్రిలో వైద్యుల నిర్వాకం.. సిజేరియన్‌ చేసి పొట్టలో కత్తెర మరిచిపోయారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.