ETV Bharat / bharat

టీ ఇవ్వలేదని సర్జరీ మధ్యలో ఆపేసిన డాక్టర్​! మత్తుమందుతో పేషెంట్లు​ అలానే - నాగ్​పుర్​లో వైద్యుడి నిర్లక్ష్యం

Doctor Left The Surgery Due To Not Getting A Tea : సర్జరీ చేయటానికి వెళ్లిన ఓ డాక్టర్ పూర్తి చేయకుండానే మధ్యలోనే ఆపరేషన్​ థియేటర్​ నుంచి బయటకు వచ్చేశాడు. ఆపరేషన్​ కోసం వచ్చిన నలుగురు మహిళలు మత్తుమందుతో అలానే ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ డాక్టర్​ అలా చేయడానికి కారణమేమిటో తెలుసా!

Doctor Left The Surgery Due To Not Getting A Tea

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2023, 3:04 PM IST

Doctor Left The Surgery Due To Not Getting A Tea : టీ ఇవ్వలేదని సర్జరీ పూర్తి కాకుండానే ఆపరేషన్​ థియేటర్​ నుంచి ఓ డాక్టర్ బయటకు వచ్చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్​పుర్​ జిల్లాలో జరిగింది. సర్జరీ చేయకుండా డాక్టర్​ వచ్చేసిన ఘటనపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఓ కమిటీని వేసింది.

జిల్లాలోని ఖట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్​ చేయించుకోవడానికి నలుగురు మహిళలు వచ్చారు. వాళ్లకి శస్త్ర చిక్సిత చేసేది డాక్టర్ తేజ్​రామ్​ భలవి. సర్జరీ చేయటానికి వెళ్లే ముందు టీ కోసం అక్కడ వాళ్లని అడిగారు వైద్యుడు. అయితే ఎవరూ డాక్టర్​కు టీ ఇవ్వలేదు. ఈ క్రమంలో డాక్టర్ తేజ్​రామ్​ సర్జరీ చేసేందుకు ఆపరేషన్ థియేటర్​కు వెళ్లారు. నలుగురు మహిళలకు మత్తు మందు ఇచ్చారు. టీ ఇవ్వలేదనే కోపంతో డాక్టర్ సర్జరీ చేయకుండానే ఆపరేషన్​ థియేటర్​ నుంచి బయటకు వెళ్లిపోయాడు. దీంతో ఆపరేషన్​ కోసం మత్తు మందు ఇచ్చిన నలుగురు మహిళలు ఎదురుచూడాల్సి వచ్చింది.

టీ ఇవ్వకపోవటం వల్ల డాక్టర్ సర్జరీలు చేయకుండా వదిలేశాడని.. వెంటనే జిల్లా యంత్రాంగం మరో డాక్టర్​ను ఏర్పాటు చేసింది. ఇలా చేసినందుకు జిల్లా యంత్రాంగం డాక్టర్​ను విచారించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయంపై జిల్లా పరిషత్​ ఉపాధ్యక్షులు కుందా రౌత్ స్పందించారు. టీ రాకపోవటం వట్ల డాక్టర్ సర్జరీ చేయకుండా వెళ్లినందుకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డాక్టర్​ ఈ ప్రవర్తన కారణంగా ఆపరేషన్​ కోసం మత్తు మందు ఇచ్చిన నలుగురు మహిళలు వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చినందుకు బాధగా ఉందని అన్నారు. అలానే డాక్టర్​ తేజ్​రామ్​ భలవిపై ఐపీసీ 304 సెక్షన్​ కింద ఫిర్యాదు చేయాలని డిమాండ్​ చేశారు.

పంటి చికిత్స కోసం వెళ్లి పక్షవాతానికి గురైన మహిళ.. వైద్యుడి నిర్లక్ష్యం వల్లే..
కొన్నిరోజుల క్రితం.. పంటి నొప్పితో ఆస్పత్రికి వెళ్లి.. వైద్యుడి నిర్లక్ష్యంతో శాశ్వతంగా అంగ వైకల్యానికి గురైంది ఓ మహిళ. డాక్టర్​ బాధ్యతారాహిత్యం వల్ల తన ఎడమ చెయ్యి, కాలులో చలనాన్ని కోల్పోయింది. ఈ పరిస్థితికి కారణమైన వైద్యుడికి రూ.9.2లక్షల ఫైన్​ విధించింది జిల్లా వినియోగదారుల కోర్టు. అసలేం జరిగిందో తెలియాలంటే ఇక్కడ క్లిక్​ చేయండి

వైద్యుడిపై కులవివక్ష!.. వెక్కివెక్కి ఏడ్చిన డాక్టర్.. మేక కోసం తల్లి దారుణ హత్య

వైద్యుడి నిర్లక్ష్యం.. వీడియో కాల్ ద్వారా ప్రసవం.. శిశువు సగం బయటకు రాగానే..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.