ETV Bharat / bharat

హిందుత్వ వైపు అడుగులు.. డీఎంకేలో ఈ మార్పేంటి? - హిందు ఓట్లకోసం డీఎంకే వ్యూహం

నాస్తికత్వం ఆ పార్టీ విధానం. దేవుడు అంటే ఆమడదూరం. ఎవరెన్ని విమర్శలు చేసినా దశాబ్దాలుగా అదే సిద్ధాంతం. మరిప్పుడు.. హిందువుల కోసం బోలెడన్ని వరాలు. హిందుత్వ పార్టీలు సైతం ఆశ్చర్యపోయేలా తాయిలాలు. ఇదీ తమిళనాట డీఎంకేలో వచ్చిన పెను మార్పు. ఏప్రిల్‌ 6న జరిగే శాసనసభ ఎన్నికల కోసం డీఎంకే ప్రకటించిన మేనిఫెస్టో అచ్చంగా ఈ మార్పునే ప్రతిబింబిస్తోంది. ఎందుకు డీఎంకే ఇంతలా మారిపోయింది. ఇది పరిస్థితులతోపాటు వచ్చిన మార్పా? లేక భాజపా హిందుత్వ ప్రచారాన్ని అడ్డుకునే వ్యూహమా?.

DMK focusing on hindus ahead of Tamilnadu polls
హిందుత్వ వైపు అడుగులు.. డీఎంకేలో ఈ మార్పేంటి?
author img

By

Published : Mar 15, 2021, 9:43 AM IST

తమిళనాడుకు ఆలయాల నగరం అని పేరు. ఆధ్యాత్మికతకు మాత్రమే కాదు భారతీయ శిల్పకళా వైభవం అంతా ఇక్కడే ఉందా అనిపించేలా అపురూప ఆలయాలకు నెలవు ఈ ప్రాంతం. అలాంటి తమిళనాడును సుదీర్ఘ కాలం పాలించిన డీఎంకే విధానం మాత్రం నాస్తికత్వం. హిందుత్వం, లౌకికత్వం అని రాజకీయాలు నడిచే భారతదేశంలో ద్రవిడ పార్టీగా గుర్తింపు పొందిన డీఎంకేకు సుదీర్ఘకాలంగా నాస్తికత్వం ఓ విధానం. పార్టీ వ్యవస్థాపకుడు కరుణానిధి అయితే కరడుగట్టిన నాస్తికుడిగా గుర్తింపు పొందారు. బతికున్నన్ని రోజులు కరుణానిధి వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా పార్టీ పరంగానూ అదే విధానాన్ని అనుసరించారు.

ద్రవిడ సిద్ధాంతానికి వ్యతిరేకమంటూ హిందూ పండగలకు శుభాకాంక్షలు కూడా చెప్పని పార్టీ డీఎంకే. ఈ పార్టీలో లక్షలాది మంది హిందూ నేతలు, కార్యకర్తలు ఉన్నా.. ఎప్పుడూ తమ మతాన్ని చాటుకునే వైఖరికి దూరంగానే ఉంటారు. అయితే తండ్రి మరణం తర్వాత డీఎంకే పగ్గాలు అందుకున్న స్టాలిన్‌.. డీఎంకేను ఆ విధానం నుంచి పక్కకు జరుపుతున్నట్లే కనిపిస్తోంది. శనివారం ప్రకటించిన ఆ పార్టీ మేనిఫెస్టోను పరిశీలిస్తే అది స్పష్టంగా అర్థమవుతుంది.

హిందువులను ఆకట్టుకునేలా..

హిందువులను ఆకట్టుకునేలా అనేక హామీలను తమ మేనిఫెస్టోలో పొందుపర్చింది డీఎంకే. హిందూ దేవాలయాలు, పవిత్ర ప్రదేశాల పునరుద్ధరణకు వెయ్యి కోట్ల రూపాయల కేటాయింపు, కొండ మీద ఉండే ప్రముఖ దేవాలయాల వద్ద రోప్‌-వే ఏర్పాటు వంటి హామీలను ఇచ్చింది. ఇవి కాకుండా అర్చకుల గౌరవ వేతనం పెంపు, ఆలయ ఉద్యోగులకు పింఛను సహా సంక్రాంతి పండగకు బోనస్‌ ఇచ్చే మార్గాలను అన్వేషిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది.

తమిళనాడు నుంచి ఏటా లక్షమంది పూరీ, బద్రీనాథ్‌, కేదర్‌నాథ్‌ యాత్రలకు వెళ్తుండగా.. వారికి ఒక్కొక్కరికి 25వేల సబ్సిడీ అందజేస్తామని ప్రకటించింది. 19వ శతాబ్దం నాటి కుల వ్యతిరేక కవి రామలింగ అడిగలర్‌ బోధనలను ప్రచారం చేసేందుకు కడలూరు జిల్లా వడలూరులో అంతర్జాతీయ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది.

ఇదే తొలిసారి..

హిందువులను ఆకట్టుకునేలా మేనిఫెస్టోలో ఇన్ని హామీలను పొందుపర్చడం డీఎంకే చరిత్రలో ఇదే తొలిసారి. అయితే డీఎంకే ఇంతలా మారిపోవడానికి చాలా పెద్ద కారణాలే ఉన్నాయని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యర్ధి అన్నాడీఎంకేతో కలిసి తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న భాజపా ప్రధాన ఆయుధం హిందుత్వం. తమిళనాడులో డీఎంకేను ఎట్టిపరిస్ధితుల్లో అధికారంలోకి రానీయకుండా చేసి ఆ రాష్ట్రంపై తమ పట్టును కొనసాగించాలని భాజపా సైతం పట్టుదలతో ఉంది. తమిళనాడులో భాజపా పోటీ చేస్తున్నది 20 స్ధానాల్లోనే అయినా ఆ పార్టీ బలంగా వినిపించే హిందుత్వ నినాదానికి అడ్డుకట్ట వేయాలంటే తాము ఆ మార్గంలోనే నడవాలన్నది డీఎంకే వ్యూహంగా భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే డీఎంకే తమ మేనిఫెస్టోలో హిందువులను ఆకట్టుకునేలా లెక్కకు మించిన హామీలను పొందుపర్చిందని రాజకీయ విశ్లేషకుల మాట. మరి డీఎంకే శాసనసభ ఎన్నికల వరకే ఈ హిందుత్వ అనుకూల వైఖరిని పరిమితం చేస్తుందా, లేక భవిష్యత్తులోనూ కొనసాగిస్తుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.

ఇదీ చదవండి:ఒకే కుటుంబంలో 14 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.